Burden on Electricity Consumers: అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లతో పాపం చేసిందంతా అధికారులు. ఆ నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా ధరల భారం మొత్తాన్ని ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు వెయ్యి కోట్ల భారం వేసిన తర్వాత గానీ అధికారులకు తాము చేసిన తప్పు తెలిసిరాలేదు. అధిక ధరకు కుదుర్చుకున్న స్వల్పకాలిక ఒప్పందాలను ఎట్టకేలకు రద్దుచేశారు. దీంతో ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు అధిక ధరకు కుదుర్చుకున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను వెనక్కి ఇచ్చేశాయి. దీంతో ప్రజలపై పడబోయే సుమారు 200 కోట్ల భారం తప్పింది.
వేసవిలో విద్యుత్ డిమాండ్ సుమారు 270 మిలియన్ యూనిట్లకు చేరుతుందని డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ పోను ఇంకా అవసరమైన మేరకు వివిధ ఉత్పత్తి సంస్థలతో డిస్కంలు ఎస్టీఓఏను కుదుర్చుకున్నాయి. అంచనాల మేరకు డిమాండ్ పెరగకపోవడం వలన అలా కొనే విద్యుత్ మిగిలిపోతోంది. దీంతో తక్కువ ధరకు అందే థర్మల్ విద్యుత్‌ను పక్కనపెట్టి అధిక ధరకు ఎస్టీఓఏల ద్వారా వచ్చే విద్యుత్‌ను డిస్కంలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేస్తున్న డిస్కంల నిర్వాకంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాలతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
విద్యుత్ బిల్లు చూస్తే దడ - కట్టలేక వణికిపోతున్న జనం - Electricity Bill Hike in YCP Govt
గత ఏడాది అక్టోబరులో ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు 3 వేల 640 ఎంయూలను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అందించాలి. ఈ ప్రకారం డిమాండ్‌కు అనుగుణంగా రోజుకు సుమారు 35 ఎంయూల విద్యుత్ ఎస్టీఓఏల ద్వారా అందనుంది. ఆ విద్యుత్‌కు యూనిట్‌కు సగటున 8 రూపాయల 69 పైసల చొప్పున డిస్కంలు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ఛేంజీల్లో యూనిట్ ధర గరిష్ఠంగా నాలుగున్నర రూపాయలు ఉంటోంది.
మూమూలు వేళల్లో యూనిట్ ధర 3 రూపాయలకు మించదు. పంపిణీ, సరఫరా నష్టాల కింద యూనిట్‌కు 69 పైసల చొప్పున లెక్కించినా, ఇంకా యూనిట్‌కు మూడున్నర రూపాయల వరకు అదనంగా డిస్కంలు చెల్లిస్తున్నట్లే..! ఎస్టీఓఏల ద్వారా ఇప్పటివరకు తీసుకున్న విద్యుత్‌కు మార్కెట్ ధర కంటే సుమారు వెయ్యూ 74 కోట్లు అదనంగా చెల్లించినట్లు అంచనా. ఆ మొత్తం ట్రూఅప్ రూపేణా వినియోగదారులపై పడనుంది.
విద్యుత్ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు- అన్నదాతకు తలకుమించిన పెట్టుబడులు
ప్రస్తుతం గాలుల సీజన్ కావడంతో పవన విద్యుత్ యూనిట్ల నుంచి గ్రిడ్‌కు రోజుకు 60 ఎంయూల విద్యుత్ అందుతోంది. ఆగస్టు వరకు పవన విద్యుత్ భారీగా అందుతుంది. దీంతో పాటు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో రోజుకు సుమారు 15 ఎంయూల సౌర విద్యుత్ అందుతోంది. ఈ రెండు వనరుల నుంచి 75 ఎంయూల (Million Units) విద్యుత్ వస్తోంది. దీంతోపాటు కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ఇతర ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోతుంది. దీంతో ఎస్‌టీఓఏ ద్వారా వచ్చే విద్యుత్ మిగిలిపోతుంది. ఆ విద్యుత్‌ను మార్కెట్‌లో తక్కువ ధరకే డిస్కంలు విక్రయిస్తున్నాయి.
జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్!