Facing Bills Are Due Problems : తెలుగు రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణం, కల్వర్టులు, ఇతర నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసే గుత్తేదారులు తమ భవిష్యత్తు దయనీయంగా మారిందని వాపోతున్నారు. అఫ్గానిస్థాన్ కంటే దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి అన్నారు. తెలంగాణలో 8 ఏళ్లలో ఒక్కసారి కూడా గత సీఎంను కలిసే అవకాశం రాలేదని చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాటు పనులను సైతం టెండర్ విధానంలో కాకుండా ఇష్టారీతిన అప్పజెప్పారని ఆయన ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాజనకంగా కనిపిస్తోందని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించినట్లు నర్సింహ్మారెడ్డి తెలిపారు.
నాలుగు విడతల్లో రూ.3 లక్షలు.. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం
Contractors Have Problems With Pending Bills : కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 10 వేల కోట్లకు పైగా బిల్లులు బకాయి పడిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బొల్లినేని సీనయ్య తెలిపారు. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పని చేయాలనుకుంటే మొదట నిధులు కేటాయించి అ తర్వాత టెండర్లు పిలవాలని సూచించారు. ఇప్పటికే పనులు పూర్తి చేసిన గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని సీనయ్య సూచించారు.
"మేము ఎదుర్కొంటున్న సమస్యలలో పెమెంట్స్ ఒకటి. బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఈ చెల్లింపులు ట్రాక్ తప్పింది. కొందరికి వెంటనే పేమెంట్ వస్తుంది. మరొకరికి చాలా రోజులైనా పేమెంట్ రాదు. ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ఢికి తెలియజేశాం. అప్పటి నుంచి చిన్న కాంట్రాక్టర్లకు కోటి రూపాయలు ఉంటే 20 లక్షలు వెంటనే విడుదల చేస్తున్నారు." -ఎస్.నర్సింహ్మారెడ్డి, బీఏఐ జాతీయ అధ్యక్షుడు
స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించాలంటూ బిల్డర్స్ ఆందోళన
Contractors Financial Problems Issue : ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్‌లో ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్‌ను నిర్వహించనున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 800 మందికి పైగా గుత్తేదారులు పాల్గొంటారని నిర్మాణ రంగంలో అధునాతన సాంకేతికతపై సెమినార్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వర్క్‌షాప్స్, నిర్మాణ పరికరాలు, మెటీరియల్ వంటి అంశాలపై గుత్తేదారులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు నవెల్లడించారు.
"రాష్ట్రంలో గుత్తేదారులకు ప్రభుత్వం 10 వేల కోట్లకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పని చేయాలనుకుంటే మొదట నిధులు కేటాయించి ఆ తర్వాత టెండర్లు పిలిచి గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలి. సమస్యలు ఎక్కడున్న ఈ అసోసియేషన్ ఉపయోగ పడుతుంది. ఈ అసోసియేషన్ కాంట్రాక్టర్స్, ప్రభుత్వానికి గుత్తేదారులకు మధ్య వారధిలాగా పనిచేస్తుంది. సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుంది." -బొల్లినేని సీనయ్య, మాజీ అధ్యక్షుడు