ETV Bharat / state

'వాడివేడి చర్చలతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు' - Telangana Assembly Session

Telangana Assembly Session : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నాలుగు బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. జాబ్ క్యాలెండర్, హైదరాబాదు నగరాభివృద్ధి హైడ్రా, తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. జూలై 23వ తేదీ నుంచి ఈనెల 2వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 65 గంటల 33 నిమిషాలు బడ్జెట్ సమావేశాలు జరిగాయి .

Telangana Assembly Session
Telangana Assembly Session (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 6:46 AM IST

Telangana Assembly Session 2024 End : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వాడి వేడి చర్చల మధ్య ముగిశాయి. గత నెల 23వ తేదీన మొదలైన అసెంబ్లీ సమావేశాలు ఈనెల రెండవ తేదీ వరకు కొనసాగాయి. తొమ్మిది రోజులు పాటు 65 గంటల 33 నిమిషాలు శాసనసభ సమావేశాలు జరిగాయి. రోజు నాలుగు గంటల పాటు సమావేశాలు జరిగాయనుకుంటే మొత్తం 16 రోజులపాటు సమావేశంలో జరిగినట్లు అంచనా వేసినారు.

బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ : ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరగడంపై అసెంబ్లీలో చర్చకు ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అన్ని పార్టీలు చర్చించి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి నివేదించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టగా 27వ తేదీన బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. 29వ తేదీన 30వ తేదీలు రెండు రోజులు పాటు వివిధ శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి అమోదం తెలిపారు.

పలు బిల్లులకు ఆమోదం : నిన్న మొన్న రెండు రోజులు పాటు ప్రభుత్వం నాలుగు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అందులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ 2024 బిల్లు. సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు. టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ బిల్లు, తెలంగాణ చట్టాల మార్పు బిల్లు, క్రీడాకారులకు ప్రోత్సాహకాల అందించే బిల్లులకు అమోదం తెలిపింది. ఇక శాసనసభ సమావేశాలు మొదలైన రోజు మినహాయిస్తే ప్రశ్నోత్తరాలను నిర్వ హించలేదు.

శాసనసభ దృశ్యాలను మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : మంత్రి శ్రీధర్ బాబు - Sridarbabu On Morphing Video

గ్రూపు -1 ఉద్యోగాలు : నిఖిత జరినా, సిరాజులకు గ్రూపు -1 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నియామకాల సవరణ బిల్లు ఆమోదం తెలిపింది. ఇవి కాకుండా హైదరాబాదు నగరా అభివృద్ధి, హైడ్రా ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్, ధరణి కమిటీ నివేదిక, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మధ్య వాడి వేడి విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్ 23 గంటలు : బడ్జెట్ సమావేశాలలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 9 రోజుల్లో మంత్రులు 23 గంటల 47 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు 12 గంటల 45 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీ చెందిన సభ్యులు 12 గంటల 57 నిమిషాలు, బీజేపీ చెందిన సభ్యులు ఐదు గంటల 55 నిమిషాలు, ఎంఐఎం చెందిన సభ్యులు 7 గంటల 34 నిమిషాలు, సీపీఐ రెండు గంటల 35 నిమిషాల పాటు శాసనసభలో సమయాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొంది.

రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాలు మాట్లాడిన సీఎం : పార్టీల వారీగా తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాలు, బీజేపీ ఫ్లోర్ లీడర్ గంట 26 నిమిషాలు, ఎంఐఎం పక్ష నేత ఐదు గంటల 41 నిమిషాలు, సీపీఐ పక్ష నేత రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు సమయాన్ని వాడుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కేటీఆర్ జగదీశ్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సుదీర్ఘంగా మాట్లాడేందుకు అవకాశం కల్పించినట్లు శాసనసభ స్పీకర్ వెల్లడించారు హరీష్ రావు రెండు గంటల 16 నిమిషాలు కేటీ రామారావు రెండు గంటల 56 నిమిషాలు జగదీశ్ రెడ్డి గంట పది నిమిషాలు పల్లా రాజేశ్వర్ రెడ్డి గంట ఏడు నిమిషాల పాటు మాట్లాడినట్లుగా కణంకాలు స్పష్టం చేస్తున్నాయి అదే విధంగా శాసనమండలి ఆరు రోజులు పాటు 20 గంటలు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో అక్రమాల నివారణకే హైడ్రా : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Reddy on HYDRA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.