ETV Bharat / state

రేపు మధ్యాహ్నం బీఆర్​ఎస్​ఎల్పీ భేటీ - బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ - BRSLP Meeting on July 23rd - BRSLP MEETING ON JULY 23RD

BRS Legislative Party Conference : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్​ శాసనసభాపక్షం మంగళవారం భేటీ కానుంది. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంద‌రూ హాజ‌రు కావాల‌ని పార్టీ అధినేత కేసీఆర్​ ఆదేశించారు. బ‌డ్జెట్ మీటింగ్​లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌నున్నారు.

BRS Legislative Party Conference
BRSLP Meeting on July 23rd (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 5:09 PM IST

Updated : Jul 22, 2024, 5:16 PM IST

BRSLP Meeting on July 23rd : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం మంగళవారం సమావేశం కానుంది. శాసనసభ వాయిదా పడిన అనంతరం రేపు మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.

సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధులపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ఆరు గ్యారంటీల అమలు, శాసనసభలో చట్టబద్దత అంశాలను ప్రస్తావించాలని భావిస్తోంది.

BRS MLAs and MLCs Meeting at Telangana Bhavan : రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చ జరగాలని కోరనుంది.

గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం, ఫీజు రీఎంబర్స్​మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలను ప్రస్తావించాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. రేపటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలకు అనుగుణంగా మరికొన్ని ఇతర అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.

Telangana State Budget 2024-25 : కాగా, ఈ నెల 23 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, 24 నుంచి శాసనమండలి సమావేశాలు జగనున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు శాసనసభలో గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌సంగం చేయ‌నున్నారు. అనంత‌రం స‌భ వాయిదా ప‌డ‌నుంది. బీఏసీ మీటింగ్​లో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. ఇక 25న అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

ఈనెల 25న తెలంగాణ బడ్జెట్! - రూ. 2.50 లక్షల కోట్లతో పద్దు? - TELANGANA BUDGET 2024

ఈ నెల 23 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు - నోటిఫికేషన్ జారీ - TELANGANA ASSEMBLY SESSIONS 2024

Last Updated : Jul 22, 2024, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.