KTR SATIRICAL COUNTERS TO SEETHAKKA : మహిళలతోపాటు అన్నివర్గాలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మహిళలకు ఉచితబస్సుల ప్రయాణంపై కేటీఆర్, తనదైన శైలిలో వ్యంగస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై, కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు తాము వద్దనట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారని, డ్రైవర్లు కండక్టర్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బస్సులు ఎక్కువ పెట్టండి, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టండంటూ ప్రభుత్వంనుద్దేశించి వ్యాఖ్యనించారు.
"బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు మేము వద్దనట్లేదు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకోవచ్చు. బస్సుల్లో సీట్లకోసం మహిళలు కొట్టుకుంటున్నారు. డ్రైవర్లు కండక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టండి". - కేటీఆర్, మాజీమంత్రి
కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ : మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పంచాయత్‌రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పందించారు. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ‌్యాఖ్యలు చేసిన కేటీఆర్, బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ, కేటీఆర్ అత్యంత జుగుస్పాకరంగా మాట్లాడారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
మీ అడబిడ్డలంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా?, కేటీఆర్‌కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఆడవారంటే, కేటీఆర్‌కు గౌరవం లేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందన్నారు. గత పది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో క్లబ్బులు పబ్బులు ప్రోత్సహించిన చరిత్ర మీదని సీతక్క విమర్శించారు.
క్షమాపణకు మంత్రి పొన్నం డిమాండ్ : కేటీఆర్ వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. అక్కా, చెల్లెళ్లపై ఫేక్ వీడియోలతో కుట్లు, అల్లికలంటూ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను డ్యాన్సులు చేసుకోమని అవమానించిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లలో కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల పట్ల వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
'రాష్ట్రం నుంచి సమర్థుడైన నాయకుడు ఒక్కరు దొరకలేదా' - రాజ్యసభకు మను సింఘ్వీ ఎంపికపై కేటీఆర్
మార్పు అంటే 8 నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పు చేయడమేనా? : కేటీఆర్ - KTR on Telangana Debt