ETV Bharat / state

హైకోర్టు తీర్పుతో బీఆర్​ఎస్ నేతల్లో ఉత్సాహం - బైపోల్ తప్పవని ప్రకటన - BRS Welcomes HC Verdict On MLAs - BRS WELCOMES HC VERDICT ON MLAS

BRS Welcomes High Court Verdict on Party Defections : కాంగ్రెస్‌ అప్రజాస్వామ్య విధానాలకు తెలంగాణ హైకోర్టు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్​ వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు గులాబీ నేతలు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు. నాలుగు వారాల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నట్లు హరీశ్‌ వెల్లడించారు. ఇదే అంశంపై స్పందించిన కేటీఆర్​ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తప్పవన్నారు. ఆ స్థానాల్లో బీఆర్ఎస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

BRS Welcomes High Court Verdict on Party Defections
KTR Response On HC Verdict Regarding MLAs Disqualification Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 4:56 PM IST

KTR Response On HC Verdict Regarding MLAs Disqualification Case : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఓ వైపు పార్టీ ఫిరాయింపుల విషయంలో కఠినమైన చట్టం తెస్తామంటూ ఎన్నికల సందర్భంగా మాటిచ్చి, ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టులాంటి తీర్పని అన్నారు. మొదట్నుంచీ చెబుతున్నట్లే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ అన్నారు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్​గా ఉందన్న ఆయన, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్లటం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని కోర్టులు కూడా స్పష్టం చేశాయని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ సభాపతి సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిరాయింపులపై దిల్లీలో నాయవాదులతో కేటీఆర్ మంతనాలు - అనర్హత వేటే లక్ష్యంగా పావులు - KTR On Party Defections

రేవంత్ మాటలు నమ్మి అడ్డంగా మోసపోయిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఊసరవెల్లి కూడా రాహుల్ గాంధీని చూసి సిగ్గుపడుతుందన్న ఆయన, ఓ వైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి అటు న్యాయస్థానంలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. వచ్చే ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బుద్ది చెబుతారని అన్నారు.

Harish Rao Response On Party Defections Judgement : మరోవైపు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మాజీమంత్రి, బీఆర్ఎస్​ సీనియర్​ నేత హరీశ్‌రావు తెలిపారు. నాలుగు వారాల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హత‌కు గురికావ‌డం త‌థ్యమని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అలాంటి నాయకులకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఓ పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలుండాల్సిందేనని బీఆర్ఎస్​ సీనియర్‌ నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఆ ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి - పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు - TG HC on MLAs Disqualification Case

ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారు - మా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లారు : కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER DEFECTION

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.