ETV Bharat / state

మరోసారి కారు బోల్తా - లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ - BRS Defeat in Lok Sabha Polls 2024 - BRS DEFEAT IN LOK SABHA POLLS 2024

BRS Defeat in Lok Sabha Polls 2024 : గులాబీ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేదు. ఏకంగా ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్‌ కోల్పోయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించిన ఆ పార్టీ, ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 17 నియోజకవర్గాల్లో కేవలం 16.6 శాతంతో 36 లక్షలకుపైగా ఓట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 51 లక్షలకుపైగా ఓట్లను కోల్పోయింది.

BRS Defeat in Lok Sabha Elections 2024
BRS Defeat in Lok Sabha Elections 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 5:46 PM IST

Updated : Jun 5, 2024, 11:19 AM IST

రాజకీయ ప్రస్థానంలో బీఆర్ఎస్‌కు ఘోర పరాజయం (ETV Bharat)

BRS Got Zero Seats in Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించని భారత్ రాష్ట్ర సమితి దారుణ ఓటమిని చవిచూసింది. పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయంతో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. 2004 ఎన్నికలు మొదలుకొంటే లోక్‌సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

Lok Sabha Election Results 2024 in Telangana : రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 సీట్లలో విజయం సాధించింది. రాష్ట్రంలో రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది.

ఒక్కటంటే ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవని బీఆర్ఎస్ : అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో అంత కంటే ఘోర పరాజయాన్ని చవిచూసి ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. మొత్తం 17 సీట్లకుగాను ఏకంగా ఎనిమిది స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ధరావత్తు కూడా కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, జహీరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు.

BRS Got Zero Seats in Telangana 2024 : ఇందులో మూడు స్థానాలు చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలు బీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎంపీ సీట్లు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయినప్పటికీ అక్కడ ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. లాస్య నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ భారత్ రాష్ట్ర సమితి పరాజయం పాలైంది.

మెదక్, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. ఐనా ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. గులాబీకి కంచుకోటగా చెప్పుకునే కరీంనగర్‌తోపాటు, పెద్దపల్లి, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్‌ స్థానాల్లోనూ భారత్ రాష్ట్ర సమితి మూడో స్థానానికే పరిమితమైంది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఆ రెండు చోట్ల కూడా పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఓటమి పాలయ్యారు.

ఓట్ల పరంగా చూస్తే 2018 శాసనసభ అత్యధిక శాతాన్ని అందుకొన్న బీఆర్ఎస్ క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంతో 97,00,948 ఓట్లను సాధించింది. ఆ వెంటనే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 41.29 శాతానికే పరిమితమై 76,96,848 ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37.35 శాతానికి గులాబీ పార్టీ ఓట్ల శాతం పడిపోయింది. ఆ ఎన్నికల్లో పార్టీకి 87,53,924 ఓట్లు లభించాయి.

21 శాతానికి పైగా ఓట్లు కోల్పోయిన బీఆర్ఎస్ : తాజా లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్ల శాతం గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పడిపోయింది. కేవలం 16.68 శాతం మాత్రమే సాధించి 36,37,086 ఓట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 51 లక్షలకు పైగా ఓట్లను బీఆర్ఎస్ నష్టపోయింది. కేవలం ఆరు నెలల్లోనే 21 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది.

ఈ ఫలితాలు చాలా నిరాశపరిచాయి : లోక్‌సభ ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్ - KTR Tweet On Election Results

కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 సీట్లు - 'ఎంఐఎం'దే హైదరాబాద్ - తెలంగాణలో గెలిచిన ఎంపీ అభ్యర్థులు వీరే - MP Elections Results

Last Updated : Jun 5, 2024, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.