BRS Parliamentary Meeting in Erravalli : పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ గళం గట్టిగా వినిపించాలని ఎంపీలకు కేసీఆర్(KCR) సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్‌ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని, అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్‌ఎస్(BRS) మాత్రమేనని స్పష్టం చేశారు.
నిజామాబాద్ లోక్‌సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?
విభజన చట్టం ప్రాకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమే తప్ప లాభంలేదన్నారు. ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారన్నారు. బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరడదామని పేర్కొన్నారు. తర్వలోనే తాను ప్రజల్లోకి రానున్నట్లు కేసీఆర్ తెలిపారు.
MP Nama in Parliamentary meeting : విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్‌లో మాట్లాడతామని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. తెలంగాణ గళం, బలం, దళం బీఆర్‌ఎస్ మాత్రమేనని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ మైత్రి బట్టబయలైంది : హరీశ్‌రావు
BRS Latest News : బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావుతో పాటు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్‌రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వైఖరి, వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సర్జరీ అనంతరం కేసీఆర్ పార్టీ నేతలతో తొలిసారిగా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ శస్త్ర చికిత్స నుంచి మెల్లమెల్లగా కోలుకుంటూ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.
నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో నాడు కనిపించిన రాజకీయ నేపథ్యం నేడు కనిపించలేదా? : కేటీఆర్