BRS MLAs Reacts on Congress Indravelly Meeting : ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపాన్ని తాకే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), బీఆర్‌ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి పాపాన్ని కాంగ్రెస్ కడుక్కోవాలంటే సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
ఆ విషయంలో ఒక్క మాటా మాట్లాడరేం - రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు : కేటీఆర్
Balka Suman Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి పదవీ భయం పట్టుకుందని అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని బాల్క సుమన్(Balka Suman) దుయ్యబట్టారు. నూతన ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం, రాష్ట్రాన్ని బాగా నడపండి, తెలంగాణ గౌరవం తగ్గనీయవద్దని మంత్రులు రాజనర్సింహ, శ్రీధర్ బాబుతో కేసీఆర్ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్(BRS) పాలనలోనే ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు వైద్యసదుపాయాలు కల్పించామన్నారు. కేసీఆర్‌పై అనుచితంగా వ్యాఖ్యలు చేసినంతా మాత్రాన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠ ఏమి పెరగదని ఎద్దేవా చేశారు.
ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి - సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
కాంగ్రెస్ అధిష్ఠానంలో ఉన్న ముఖ్యమంత్రి పోటీదారులపై, రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని పదవీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నలుగురు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని రేవంత్ రెడ్డిని కలిశాక కేఏ పాల్ చెప్పారన్నారు. రైతుబంధు డబ్బులు గుత్తేదార్ల ఖాతాల్లోకి వెళ్లాయని, దిల్లీకి కప్పం కట్టేందుకు డబ్బులను మళ్లించారని బాల్క సుమన్ దుయ్యబట్టారు. కేసీఆర్ రాజనీతిజ్ఞుడులా పాలిస్తే రేవంత్ రెడ్డి పోకిరీ పాలన చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడితేనే హామీలు అమలు చేస్తారని, లేదంటే హామీలు ఎత్తివేస్తారని దుయ్యబట్టారు. ఇంద్రవెల్లిపై(Indravelly) కపట ప్రేమను చూపించకుండా, అమరులు కుటుంబాలకు పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజయ్యకు బీఆర్‌ఎస్ సముచిత స్థానం ఇచ్చిందని, ఎందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారో తెలియదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఇంద్రవెల్లిలో నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్‌కు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఎలాంటి ఆంక్షలు లేవని, నిన్న ఐదు జిల్లాల పోలీసులను పెట్టి ఎవరినీ నివాళి అర్పించకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
"కేసీఆర్ రాజనీతిజ్ఞుడులా పాలిస్తే రేవంత్ రెడ్డి పోకిరీ పాలన చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తేనే హామీలను అమలు చేస్తామంటున్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడితేనే హామీలు అమలు చేస్తారు. లేదంటే హామీలను ఎత్తివేస్తారు". - బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే
మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు కేంద్రం చేతిలో పెట్టడమా : హరీశ్‌రావు