ETV Bharat / state

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 4:34 PM IST

Telangana Assembly Session 2024 : బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిరడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి మంచిదికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

TELANGANA ASSEMBLY SESSIONS 2024
BRS MLA Harish Rao Reaction on CM Revanth Comments (ETV Bharat)

BRS MLA Harish Rao Reaction on CM Revanth Comments : నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి మంచిదికాదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా అని ప్రశ్నించారు. రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా అని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే తాము చేస్తున్నా తప్పా అని ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నారని హెచ్చరించారు.

KTR On CM Revanth Reddy Comments : సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అక్కలను నమ్ముకుంటే ముంచుతారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని సబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తునట్లు అనిపిస్తుందని మండిపడ్డారు.

Sabitha Indira Reddy Fires on CM Revanth : అంతకుముందు సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలకు సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. తన గురించి సభలో మాట్లాడాలంటే ఒక గంట చర్చ పెడదామని తన కుటుంబం జిల్లాకు చేసిన సేవలు అన్ని అంశాల గురించి మాట్లాడదామని తెలిపారు. మమ్మల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్​లో కూర్చుంటారని ఎలా అంటారని ప్రశ్నించారు. తాను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్​లోకి తీసుకొచ్చినందుకు ఉత్తమ్ కుమార్​రెడ్డి తన కుమారునికి టికెట్ రాకుండా అడ్డుకున్నారని గుర్తుకు చేశారు. భట్టి వచ్చినపుడు ఏం మాట్లాడామో అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. హోమ్, విద్యాశాఖ పద్దులపై తాను మాట్లాడిన అంశాలు బాగా తగిలాయని అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఒక మహిళను ఇలా అవమానిస్తారా అని మండిపడ్డారు.

సీఎం Vs మాజీ మంత్రి - 'సబితక్క నన్ను మోసం చేసింది - రేవంత్ నన్నే టార్గెట్ చేశారు' - Sabitha Indra Reddy vs CM Revanth

ట్యాంక్‌బండ్‌లో నీటిని కొబ్బరి నీళ్లు చేస్తానని నేనెప్పుడూ చెప్పలేదు : రేవంత్ రెడ్డి - CM REVANTH SLAMS KTR IN ASSEMBLY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.