ETV Bharat / state

ఖమ్మం కాంగ్రెస్​లో జోరందుకున్న చేరికలు - హస్తం తీర్థం పుచ్చుకున్న నలుగురు బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు - BRS Leaders Joined Congress

BRS Leaders Joined Congress Party in Khammam : లోక్​సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్​ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మిత్రపక్షం సీపీఐతో కలిపి ఖమ్మం లోక్​సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఊపు మీదుంది. మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లోనూ పాగా వేయాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రానున్న ఎంపీ ఎన్నికల దృష్ట్యా మళ్లీ పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్​ పార్టీ దృష్టి సారించింది. ప్రధానంగా ఖమ్మం మేయర్​ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కార్పొరేటర్లను ఆకర్షిస్తోంది. నలుగురు కార్పొరేటర్లు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

BRS Leaders Joined Congress
BRS Leaders Joined Congress Party in Khammam
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 10:52 AM IST

ఖమ్మం కాంగ్రెస్​లో జోరందుకున్న చేరికలు

BRS Leaders Joined Congress Party in Khammam : ఖమ్మంలో భారత రాష్ట్ర సమితికి ఝలక్​ ఇస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) క్యాంపు కార్యాలయంలో హస్తం పార్టీలో చేరారు. ఖమ్మం అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యమనే భావనతోనే ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు కార్పొరేటర్లు నిరీషారెడ్డి, శరత్​, ప్రసాద్​, విజయలక్ష్మి ప్రకటించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో తమ డివిజన్లను అభివృద్ధి చేసుకుంటామని వెల్లడించారు. ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి స్వార్థం, స్వలాభం కోసమే రాజకీయాలు చేశారని తుమ్మల విమర్శించారు. రాష్ట్రంలో ఖమ్మం ప్రతిష్ఠను పెంచేలా అందరినీ కలుపుకొని పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

"మొన్న ఎన్నికల్లో ఖమ్మం ప్రజానికం ఒకే మాట అడిగింది. ప్రశాంతమైన ఖమ్మం కావాలి. కబ్జాలు లేనటువంటి ఖమ్మం కావాలి. ఆరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి. అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలని చెప్పి గత ఎన్నికల్లో ప్రజలు కోరుకున్నారు. గత ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. మీకు ఏం అవసరం ఉన్న మీ మనిషిగా నేను పని చేస్తాను. మళ్లీ ఖమ్మం జిల్లా కీర్తి, ప్రతిష్ఠలను అందరం కాపాడుకోవాలి." - తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి

ఖమ్మంలో త్వరలో నూతన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు : తుమ్మల నాగేశ్వరరావు

Khammam Congress Party : ఖమ్మంలో తాజా రాజకీయ పరిణామాలు బీఆర్​ఎస్(BRS)​లో కలవరానికి గురిచేస్తున్నాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ ఇటీవలే కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో విందు సమావేశం ఏర్పాటు చేసి పక్కచూపులు చూడొద్దంటూ దిశానిర్దేశం చేశారు. ఆ వెంటనే ఒక్క రోజే నలుగురు కార్పొరేటర్లు పార్టీని వీడటం గులాబీ పార్టీకి కొరకరాని అంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుమ్మల అభ్యర్థిత్వంతో బీఆర్​ఎస్​ నుంచి అప్పట్లో 9 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​(Congress) పంచన చేరారు. బల్దియాలో కాంగ్రెస్​ తరఫున 10 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ప్రస్తుతం అధికార పార్టీ బలం ఖమ్మం కార్పొరేషన్​లో 23కు పెరిగింది. త్వరలోనే మరికొంత మంది హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఖమ్మం నగరపాలకంలో పాలకవర్గం పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైగానే ఉంది. కొత్త మున్సిపల్​ చట్టం(New Municipal Act) ప్రకారం మూడేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్​ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. మూడేళ్ల పదవీకాలం పూర్తికాగానే మేయర్​పై అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది.

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ - మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశంపై ఉత్కంఠ

ఖమ్మం లోక్​సభ స్థానంపై కాంగ్రెస్​లో పోటాపోటీ - టికెట్ ఆశిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబీకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.