BRS Leader Niranjan Reddy on Krishna Dispute : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందా? లేకా బలి పెడుతుందా? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఎమ్మెల్యేలు అంగీకరించపోయినప్పడికి మినిట్స్ రాశారని కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడారని ఎద్దేవా చేశారు. అంగీకరించకుండా మినిట్స్ రాస్తే పెద్ద నేరం అవుతుందన్నారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విషయంపై కేసీఆర్ పోరాడలేదని కాంగ్రెస్ నేతలు అన్న మాటలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరోజు ప్రశ్నించకుండా ఇవాళ కేసీఆర్‌ను తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, వనరులకు కేసీఆర్ రక్షణ కవచంలా నిలిచారన్నారు. కేంద్రం ఎంత ఇబ్బంది పెట్టినా, ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ (KCR) తలొగ్గలేదని గుర్తు చేశారు.
'Rajathkumar on Krishna River Water Allocation : 'జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాల్సిందే''
కృష్ణానది జలాలపై తొమ్మిదన్నరేళ్లుగా నోరు మెదపని కాంగ్రెస్ నేతలు ఇవాళ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోమూ తలొగ్గేది లేదని ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇవ్వకుండా కేసీఆర్ ఆపారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత విఘాతం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీసుకొందన్న ఆయన, ఏమరుపాటుగా లేకపోతే తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, దీంతో తెలంగాణ రాష్ట్ర లక్ష్యం నెరవేరకుండా ఏపీ ప్రయోజనాలకు మేలు చేసినట్లవుతుందని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
BRS Leader Niranjan Reddy Fires On Congress : దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) యథాతథ స్థితి కొనసాగించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో మీకు సీట్లు ఇచ్చినందుకు ఇది బహుమానమా అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఓట్లు వేసిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ప్రజల కడుపు కొడతారా? అని అడిగారు. కృష్ణా జలాల్లో (Krishna Dispute) ఎవరి వాటా ఎంతో తేల్చే వరకు జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టామన్న మాజీ మంత్రి, ఏపీ ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వ వత్తాసు పలికినట్లు అవుతుందని అన్నారు.
తాజా పరిణామం చాలా పెద్ద కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు ఉద్దండులు అయితే వారికున్న పాండిత్యం, జ్ఞానంతో రాష్ట్రం ప్రయోజనాలు కాపాడాలని కోరారు. ఈ విషయమై దిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. దశాబ్దం కాకముందే మళ్లీ సంఘర్షణకు వెళ్లే పరిస్థితి వస్తుందని, ప్రజలు, రైతులు ఆలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆశామాషీగా తీసుకోకుండా, కేవలం లేఖ రాసి చేతులు దులుపుకోకుండా ప్రాజెక్టులు చేజారకుండా అపాలని డిమాండ్ చేశారు.
కేంద్రం సహరకిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి దీన్ని అపాలని డిమాండ్ చేశారు. వారు అధికారిక పర్యటనకు వెళ్లి రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు ఉన్నాయంటారు, వాటిపై స్పష్టత ఇవ్వమంటే ఒక్కరూ నోరు మెదపరని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల కడుపు కొడుతున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. నీరు ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తుందని సంకుచితంగా ఆలోచిస్తున్నారని ఆక్షేపించారు. పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం అంటే చేతులు దులుపుకుంటూ వచ్చారని, కనీసం నిరసన కూడా తెలపలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాపలా ఉన్నామని చెప్పే అపర మేధావులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశ్నించారు.