ETV Bharat / state

అప్పుడు రాష్ట్రంలో కరెంటు కోతలే లేకుండా చూసిన బీఆర్​ఎస్​ - ఇప్పుడు మళ్లీ చీకట్లోకి నెట్టేసిన కాంగ్రెస్ - KTR Tweet on Power Cuts in TG - KTR TWEET ON POWER CUTS IN TG

KTR Tweet on Power Cuts : రాష్ట్రంలో మళ్లీ విద్యుత్​ కోతలతో చీకటి రోజులు వచ్చాయని కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. విద్యుత్​ కోతలే లేకుండా విద్యుత్​ రంగంలో బీఆర్​ఎస్​ సృష్టించి మౌలిక వసతులను వాడుకోలేని అసమర్థ స్థితిలో సర్కార్​ ఉందని దుయ్యబట్టారు. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్​ కోతలపై ఎక్స్​ వేదిక కేటీఆర్​ ట్వీట్​ స్పందించారు.

KTR Tweet on Power Cuts
KTR Tweet on Power Cuts (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 3:56 PM IST

KTR Tweet on Power Cuts in Telangana : కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తు తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంటు కోతలు నిత్య కృత్యమయ్యాయని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆరోపించారు. విద్యుత్​ కోతలే లేకుండా విద్యుత్​ రంగంలో బీఆర్​ఎస్​ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్​ రెడ్డి సర్కార్​ ఉందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్​ కోతలపై ఎక్స్​ వేదిక కేటీఆర్​ ట్వీట్​ చేశారు. పలువురు నెటిజన్ల పోస్టింగులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ట్యాగ్​ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను రీట్వీట్​ చేశారు.

"2014తు ముందు తరుచు విద్యుత్​ కోతలు, పవర్​ హాలీడేస్​ మనకు తెలిసిందే. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్​ సర్కార్​ది. 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేయటం కారణంగా హైదరాబాద్​ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చింది. పనికి మాలిన కాంగ్రెస్​ ప్రభుత్వం మళ్లీ పదేళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. తరుచూ విద్యుత్​ కోతలతో అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలకు ఇబ్బంది తీసుకొస్తోంది. విద్యుత్​ కోతలు లేకుండా కేసీఆర్​ చేసిందేమిటని కొంతమంది అడుగుతున్నారని" ఎక్స్​ వేదికగా కేటీఆర్​ అన్నారు.

విద్యుత్​ రంగాన్ని బలోపేతం చేసింది కేసీఆర్​నే : 1,110 యూనిట్లుగా ఉన్న తలసరి వినియోగం 2,110 యూనిట్లకు చేరిందని కేటీఆర్​ తెలిపారు. సౌర విద్యుత్​ సామర్థ్యం 71 మెగావాట్ల నుంచి 5,000 పైగా మెగావాట్లకు పెంచామన్నారు. తెలంగాణలో స్థాపిత విద్యుత్​ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు చేరిందని స్పష్టం చేశారు. యాదాద్రి ప్లాంటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 25 వేల మెగావాట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రాన్స్​ మిషన్​ సామర్థ్యం 13,900 మెగావాట్ల నుంచి 37,000 మెగావాట్ల వరకు పెంచామని కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. 2014కు ముందు వరకు వ్యవసాయానికి రెండు దఫాలుగా 6 గంటల ఉచిత విద్యుత్​ వచ్చేదని పేర్కొన్నారు. కేసీఆర్​ పాలనలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్​ పంపిణీ చేసేవారమని వివరించారు. 2014వరకు ఒకరోజులో గృహ విద్యుత్​దారులకు 4 నుంచి 8 గంటల వరకు లోడ్​ రిలీఫ్​ ఉండేదన్నారు. కేసీఆర్​ వచ్చిన తర్వాత ఆ లోడ్​ రిలీఫ్ అవసరమై లేకుండా చేశారని చెప్పారు. 2014 వరకు వారంలో 3 రోజుల పవర్​ హాలీడేస్​, కేసీఆర్​ పాలనలో పవర్​ హాలీడేస్​ అనే మాటే లేదని కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన ఆ బలి దేవత ఎవరు? : కేటీఆర్ - KTR Raised Questions on Congress

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ - దేశ చరిత్రలో ఇది అసామాన్య విజయగాథ : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.