ETV Bharat / state

పోచారం పార్టీని వీడటం దురదృష్టకరం- కాంగ్రెస్‌లోకి చేరికపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్‌ - ex minister jagadish reddy - EX MINISTER JAGADISH REDDY

Jagadish Reddy Reacts on Pocharam : పోచారం శ్రీనివాస్​రెడ్డి పార్టీని వీడడం దురదృష్టకరమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారడం వల్ల పోచారంకు ఏం వస్తుందో కానీ, ప్రజల్లో అప్రతిష్ఠ మాత్రం మూటగట్టుకుంటారని ఆయన తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోచారం పార్టీ మారడం బాధాకరమని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Niranjan Reddy responds on Pocharam
Jagadish Reddy Reacts on Pocharam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 3:19 PM IST

Updated : Jun 21, 2024, 4:18 PM IST

Jagadish Reddy Reacts on Pocharam : పోచారం శ్రీనివాస్​రెడ్డి పార్టీని వీడి, కాంగ్రెస్​లో చేరడం దురదృష్టకరమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు కూడా పోచారం, కేసీఆర్‌తోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఏమీ కాదు, అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌కు పోచారం చెప్పారని తెలిపారు. ఏ బలహీనతలు, ఏం ఆకర్షించిందో పోచారం పార్టీ మారారని, ఆయనకు పార్టీలో ఏం తక్కువ చేశామని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

రైతులు మళ్లీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది : జగదీశ్‌ రెడ్డి - BRS MLA Jagadeesh Reddy

పార్టీ మారడం వల్ల పోచారంకు ఏం వస్తుందో కానీ, ప్రజల్లో అప్రతిష్ఠ మాత్రం మూటగట్టుకుంటారని పేర్కొన్నారు. పార్టీలు మారడం కొత్తగా బీఆర్ఎస్‌తోనే ప్రారంభం కాలేదని, కేసీఆర్ అదృశ్యం అవుతారని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్​కు దేశంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారని, కేసీఆర్ ఫీనిక్స్ పక్షిలా పుంజుకొంటారని, బీఆర్ఎస్ గతంలో కంటే ఘనంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం అంతటా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ శత్రువులని, కానీ బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆయన దుయ్యబట్టారు.

Niranjan Reddy responds on Pocharam : పోచారం లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయమని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీచేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామన్నారు. 2014లో గెలిచిన ఆయనను తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖా మంత్రిగా, 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్పీకర్‌గా చేసే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.

పోచారం అడిగిందే తడవుగా అన్ని పనులను ప్రభుత్వం ఆమోదించిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కట్టనన్ని ఇళ్లు బాన్స్‌వాడ నియోజకవర్గంలో కట్టడానికి కేసీఆర్ అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. మొన్న ఎన్నికల్లో ఆయన ఆరోగ్యం బాలేదని పోటీ చేయను అన్నారని, చివరకు ఆయన్నే పోటీ చేశారని దానికి పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు.

ఇప్పుడు ఏ నైతికతతో పోచారం పార్టీ మారుతున్నాడో అర్దం కావడం లేదన్నారు. ఇలాంటి వారిని చూసి తెలంగాణ సమాజం గందరగోళంలో పడుతుందని, స్పీకర్‌గా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయనకు కేసీఆర్ అత్యున్నత గౌరవం ఇచ్చారని, కుమారుడికి డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోచారంను లక్ష్మీపుత్రుడు అని, కేసీఆర్ బహిరంగ సభలు, అంతర్గత సమావేశాల్లో వేనోళ్ల పొగిడారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోచారం ఇలా చేయడం బాధాకరమన్నారు.

"పోచారం పార్టీ మారడం దురదృష్టకరం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు పోచారం, కేసీఆర్‌తోనే ఉన్నారు. ఫలితాలపై అధైర్యపడొద్దని కేసీఆర్‌తో తెలిపారు. పోచారంకు బీఆర్ఎస్‌పార్టీ అన్ని అవకాశాలను ఇచ్చింది." - జగదీశ్‌రెడ్డి, మాజీమంత్రి

పోచారం పార్టీని వీడటం దురదృష్టకరం- కాంగ్రెస్‌లోకి చేరికపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్‌ (ETV BHARAT)

పథకాల అమలుకు "ఓస్త్రీ రేపు రా" కథ వినిపిస్తున్నారు - నిరంజన్‌ రెడ్డి

కేసీఆర్‌కు లై డైరెక్టర్ అంటున్నారు - లైవ్‌లో దొరికిన రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ వద్దా? : నిరంజన్‌రెడ్డి - Niranjan Reddy Slams Congress

Last Updated : Jun 21, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.