ETV Bharat / state

ఒక్క రైతుతో చెప్పించినా రాజకీయాలు వదిలేస్తా - సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్ - KTR CHALLENGES CM REVANTH - KTR CHALLENGES CM REVANTH

KTR CHALLENGES CM REVANTH : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దుయ్యబట్టారు. రుణమాఫీలో అనేక కటింగ్‌లు పెట్టారని, సీఎం అంటే కటింగ్ మాస్టర్‌లా తయారయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని, ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్‌ విసిరారు.

KTR SLAMS CM REVANTH
KTR CHALLENGES CM REVANTH (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 3:08 PM IST

Updated : Aug 16, 2024, 4:04 PM IST

KTR SLAMS CM REVANTH : రాష్ట్రంలో రైతు రుణమాఫీ 40 శాతం మాత్రమే చేశారని బీఆర్ఎస్ క్యార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. రుణమాఫీలో సవాలక్ష కొర్రీలు, ఆంక్షలు పెట్టారని, రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పైన తాను సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. ఒకవేళ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన రుణమాఫీ నిజమైతే, కొడంగల్ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దామన్నారు. ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్‌ విసిరారు. సీఎంకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నట్లు తెలిపారు.

రైతుభరోసా ఎగ్గొట్టారు : రుణమాఫీలో డిసెంబరు 9 నుంచి ఆగస్టు 15 వరకు జాప్యం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. బ్యాంకులకు 9 నెలల వడ్డీ ఎవరు కడతారు? అని ఆయన ప్రశ్నించారు. 22.37 లక్షల మంది రైతులకు రూ.17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని కేటీఆర్ తెలిపారు. తాము ఉన్నప్పుడు రుణమాఫీ చేశామని, రైతుబంధు వేశామన్నారు. వర్షాకాలం రైతుభరోసా రూ.14 వేల కోట్లు ఇంకా ఇవ్వలేదని, మొన్న యాసంగీలో రూ.4 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు.

వైరాలో రేవంత్‌రెడ్డి ప్రసంగం విచిత్రంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ సగం కూడా చేయకుండా సంపూర్ణంగా చేశామనడం మోసమని ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ, అధికారులు లేకుండా గ్రామాలకు వెళ్తే రైతులే కొడతారని ఆయన వ్యాఖ్యనించారు. హరీశ్‌రావు రాజీనామా చేయాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వందశాతం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని హరీశ్‌రావు అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

యథాలాపంగా నోరుజారాను : కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు, విధానం లేదని కేటీఆర్ ఆరోపించారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్‌ పార్టీ హెల్ప్‌లైన్ పెట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, రేపట్నుంచి రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామన్నారు. నిన్న యథాలాపంగా తాను నోరు జారానని, తాను మహిళలను క్షమాపణ కోరినట్లు తెలిపారు. మహిళలపై నోరు పారేసుకున్న రేవంత్‌కు తనలా క్షమాపణ చెప్పే గుణముందా? అని ప్రశ్నించారు. వచ్చే నెల ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తామన్నారు.

"రుణమాఫీలో సవాలక్ష కొర్రీలు, ఆంక్షలు పెట్టారు. రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారు. మీడియాతో కలిసి మీసొంత నియోజకవర్గం కొడంగల్‌ వెళ్దాం. సంపూర్ణ రుణమాపీ జరిగిందని ఏ ఒక్కరైతు చెప్పినా నేను రాజీనామా చేస్తా". - కేటీఆర్, మాజీమంత్రి

నా అక్కాచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు : కేటీఆర్‌ - KTR Respond On Bus Journey Issue

మార్పు అంటే 8 నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పు చేయడమేనా? : కేటీఆర్ - KTR on Telangana Debt

Last Updated : Aug 16, 2024, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.