Lok Sabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం, ప్రజాభివృద్ధికి ఇవ్వలేదని, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టిందని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని ఆయన మండిపడ్డారు.
బీజేపీకి 400 సీట్లు ఇస్తే - పెట్రోల్ ధర రూ.400 దాటుతుంది : కేసీఆర్ - KCR Comments On BJP Congress
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్‌లో విద్యుత్ పోయినా హైదరాబాద్‌లో పోదు అనే పరిస్థితి ఉండేదన్నారు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ వెన్నెముకగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయని, కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో రూపాయికే నళ్లా కనెక్షన్ ఇచ్చామని, కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించామన్నారు. కాంగ్రెస్ వచ్చాక అధికారుల్లో విచ్చలవిడితనం వచ్చిందని చెబుతున్నారని, కాంగ్రెస్ చేసిన నేరాలు క్షమార్హమైనవి కాదని కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయ కోసం వేల కోట్లు ఖర్చు చేశామని, కాంగ్రెస్ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలను తాను కొనసాగించినట్లు కేసీఆర్ తెలిపారు. బేషజాలకు పోయి బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను నిలిపేశారని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్‌రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని, కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఏ ఊరు పోతే అక్కడి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని, డిసెంబర్ 9 పోయి పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తాం అంటున్నారని గుర్తు చేశారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని, ఏ సంవత్సరమో చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరెంట్ లేక పంటలు ఎండిపోయాయని, చందానగర్‌లో సబ్‌స్టేషన్‌పై దాడి చేసే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి కంపెనీలు భయపడి పారిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ చెప్పిన బోనస్ సాయం బోగస్ అయ్యిందని, కాంగ్రెస్ దుష్పరిపాలన ఆ పార్టీకి శాపంగా మారిందన్నారు. దళితబంధుకు బీఆర్‌ఎస్ విడుదల చేసిన నిధులను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. బీజేపీ అజెండాలో పేదల, దళితుల గురించే ఉండదన్నారు. మా రాష్ట్ర వాటా తేల్చకుండా నదుల అనుసంధానానికి ఒప్పుకునేది లేదని చెప్పానని, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు కూడా తాము ఒప్పుకోలేదన్నారు.
"పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుంది. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ వైఫల్యమే ఆ పార్టీని కాటు వేయబోతోంది". - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
బండి సంజయ్ కరీంనగర్‌కు ఏమైనా నిధులు తెచ్చారా? : కేసీఆర్ - KCR bus trip in Karimnagar
కాంగ్రెస్ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రం ఆగమాగం అయింది : కేసీఆర్ - KCR Bus Yatra in Medak