BJP MLA Maheshwar Reddy Fires On Uttam : ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాను ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు. ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్లతో జరిగిన చర్చల వివరాలను మంత్రి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 4 కంపెనీలకు అప్పజెప్పారని, నాలుగు నెలలు గడిచినా అవినీతి పరులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. తాను పైరవీ చేసి బీజేఎల్పీ పోస్ట్ తెచ్చుకున్నానని మంత్రి చేసిన విమర్శలు సరికాదన్నారు.
BJP MLA Maheshwar Reddy Comments : బీజేపీలోని అందరి నాయకులు కలిసి తనను బీజేఎల్పీగా ఎన్నుకున్నారని ఏలేటి తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎం చేసిన ఘనత బీజేపీది అని వెల్లడించారు. సమర్థవంతమైన నేతలను తయారు చేసే పార్టీ బీజేపీ అని, మంత్రి ఉత్తమ్‌లా తాను అపాయింట్‌మెంట్ కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తనపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో ఉత్తమ్ పీసీసీ పదవి కొన్నారని కాంగ్రెస్ నేతలే చెప్పారని గుర్తు చేశారు.
తాను ఏం మాట్లాడినా సబ్జెక్టుపై, తన పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడుతానని ఎవరిపైనా ఆరోపణలు చేయనని తెలిపారు. కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. దానిపై కూడా విమర్శలు చేస్తే అది ముఖ్యమంత్రిని అవమానించడమే అవుతుందన్నారు. రాష్ట్రంలో వందల కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఫాల్ట్ రైస్ మిల్లర్ల పేర్లు మీరు బయటపెట్టగలరా అని మంత్రి ఉత్తమ్‌ను ప్రశ్నించారు. కళ్ల ముందు కుంభకోణాలు కనిపిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.
నేను పైరవీ చేసి బీజేఎల్పీ పోస్ట్ తెచ్చుకున్నానని చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శలు చేయడం సరికాదు. బీజేపీలో అందరి సమన్వయంతో బీజేఎల్పీ గా నాకు అవకాశం కల్పించారు. నేను మీతో కలిసి పదేళ్లు పని చేశా. మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా? కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చాం. వందల కోట్ల బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరాం. -ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత
కేటీఆర్ అధికారం పోయిన ఫ్రస్టేషన్లో ఉన్నారు : మహేశ్వర్ రెడ్డి - BJP Maheshwar Reddy fires KTR