ETV Bharat / state

రేవంత్​ సర్కార్​ సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోంది : రఘునందన్​ రావు

BJP Leader Raghunandan Rao Fires on Congress : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణానికి బొమ్మబొరుసు లాంటివని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. రెండు పార్టీల మధ్య సంబంధం లేకపోతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డవారిపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Raghunandan Rao Slams KTR
BJP Leader Raghunandan Rao Fires on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 2:06 PM IST

Updated : Jan 30, 2024, 2:48 PM IST

BJP Leader Raghunandan Rao Fires on Congress : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి 2014 నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు భూములపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోందన్నారు. ఆట మొదలైందని మంత్రులు లీక్​లు ఇస్తున్నారు తప్పితే, తప్పుడు పనులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంబంధం లేకపోతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన బ్యూరో క్రాట్స్​పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉండదు : ఎంపీ లక్ష్మణ్

'మాజీ సీఎస్ సోమేశ్​ కుమార్ సతీమణి పేరు మీద 25 ఎకరాల భూమి రిజిస్టర్ అయ్యింది. ధరణి పేరుతో సోమేశ్​ కుమార్ 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి అక్రమమని తెలుసుకున్నప్పుడు, ఎందుకు కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదు. డీజీపీ మహేందర్ రెడ్డి అంతు చూస్తానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ అయ్యారు.' అని రఘునందన్​ రావు అన్నారు.

హరీశ్‌రావు అండదండలతోనే సీఎం రేవంత్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

Raghunandan Rao Slams KTR : కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బిహార్ బ్యాచ్ దోచుకుపోతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారని, మరి ఆయన సీఎం అయ్యాక బిహార్, ఆంధ్ర బ్యాచ్​ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

"కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తరువాత కేటీఆర్​కు మతి భ్రమించింది. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎక్కడా పని చేయలేదు కేటీఆర్. బీఆర్ఎస్​కు ఎందుకు ఓటు వేయాలో చెప్పు కేటీఆర్. ఎందుకు వేయొద్దో మేం చెబుతాం. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటూ గెలవదు. ఎమ్మెల్యేలను గోడ దూకి పారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకో కేటీఆర్." - రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే

అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు

శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు బావా బామ్మర్దులు సామాజిక మాధ్యామాల్లో తప్పుడు ప్రచారం చేశారని రఘునందన్​ రావు మండిపడ్డారు. గన్​పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. సిరిసిల్లాను ఖాళీ చేపిస్తామని, కేటీఆర్​ను రాజకీయ రాజీనామా చేపిస్తామని తెలిపారు. ఉప ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్​, కేటీఆర్​ జైలుకి వెళ్లేవారు : బండి సంజయ్​

Last Updated : Jan 30, 2024, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.