ETV Bharat / state

'రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ సిద్ధం' - ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు - Raghunandanrao Complaint EC - RAGHUNANDAN COMPLAINT TO EC ON BRS

Raghunandanrao Complaint On BRS : వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెర లేపిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.

Raghunandanrao Complaint EC Against BRS
Raghunandanrao Complaint On BRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 3:37 PM IST

Updated : May 26, 2024, 4:06 PM IST

Raghunandanrao Complaint To EC Against BRS: వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్​పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందన్నారు. డబ్బులు పంచి గెలవాలని ప్రయత్నం చేస్తున్నందుకు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనాలన్న బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్​కు రఘునందన్​రావు మెయిల్​ ద్వారా ఫిర్యాదు చేశారు.

బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టండి : ఓ బ్యాంక్‌లోని బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 30 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు కోటి చొప్పున నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్‌ ఆరోపించారు. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఖాతాను వెంటనే ఫ్రీజ్‌ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే ఎన్నికలు గెలవాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ చిల్లర ప్రయత్నాలు చేసిందని విమర్శించారు.

"గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో కేవలం డబ్బు ద్వారా మాత్రమే గెలవాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరి ప్రయత్నంగా రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జీలను పెట్టి ఓట్లు కొనేందుకు ఆ పార్టీ ప్రతినిధులకు ఓ ఖాతానుంచి రూ.30 కోట్లను బదిలీ చేసింది"- రఘునందన్​రావు, బీజేపీ నేత

'రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ సిద్ధం' - ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు (ETV Bharat)

ష్!!​ సౌండ్ ఆఫ్ - నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం - Telangana Graduate MLC By Election

MLC By-Elections Arrangements In Telangana : మరోవైపు సోమవారం (మే 27వ తేదీ) జరిగే వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్​ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తుండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్​లో బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు : ఎన్నికల్లో ఎనిమిది మంది సెక్టోరియల్ అధికారులు, 39 మంది ప్రిసైడింగ్ అధికారులు, 137 మంది పోలింగ్ సిబ్బంది, 40 మంది సూక్ష్మ పరిశీలకులు విధులు నిర్వహిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ నెల 27 న మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం - జూన్​ 5న ఫలితాలు

రేపటితో ముగియనున్న గడువు - పతాకస్థాయికి చేరుకున్న పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం - MLC ByPoll Elections 2024

Last Updated : May 26, 2024, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.