Bio Liqour Launch at Hyderabad : మద్యపాన ప్రియులకు శుభవార్త. ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయనటువంటి బయో లిక్కర్(Bio Liqour) అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లోకి బయో లిక్కర్ని ప్రవేశపెడుతున్నట్టు బయో లిక్కర్స్ అండ్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బయో లిక్కర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్, పలు బయో లిక్కర్ ఉత్పత్తులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస అమర్నాథ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి బయో లిక్కర్ అని పేర్కొన్నారు. తులసీ, అల్లం, పసుపు, లవంగ, యాలుకలు, కలబంద వంటి ఆయుర్వేద పదార్థాలను కలిపి ఈ లిక్కర్ని తయారు చేస్తున్నట్లు శ్రీనివాస అమర్నాథ్ తెలిపారు. దీనికి యూఎస్ఎఫ్డీఏ(US FDA) అనుమతి సైతం లభించినట్లు వివరించారు. బయో విస్కీ, బయో బ్రాందీ, వైల్డ్ పాక్స్ విస్కీని తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల వేళ కల్తీ మద్యం కలకలం- 20కి చేరిన మృతుల సంఖ్య! - Punjab Hooch Tragedy
మద్యపానం చేసే వారి అవయవాలపై చెడు ప్రభావం చూపవు : ఈ ఉత్పత్తుల్లో ఎటువంటి సింథటిక్ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్స్, హై క్వాలిటీ స్పిరిట్, మాల్ట్, బయో ఆల్కలాయిడ్స్తో వీటిని రూపొందించినట్లు వివరించారు. మద్యపానం చేసే వారి అవయవాలపై చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఇంకా వీటిని ధరలు తెలియాల్సి ఉంది. అందరికీ ఆరోగ్య కరమైన జీవితం ప్రసాదించేందుకు ఈ ప్రయోగం చేశారమని నిర్వాహకులు చెప్పారు.
"సింథటిక్ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్స్, హై క్వాలిటి స్పిరిట్, మాల్ట్, బయో ఆల్కలాయిడ్స్తో వీటిని రూపొందించాము. వీటిని ఇవాళ హైదరాబాద్లో ప్రవేశపెడుతున్నాము. ఈఉత్పత్తుల ద్వారా మద్యపానం తీసుకునే వారి అవయవాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. దీనికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది". - ఢా. బి శ్రీనివాస అమర్నాథ్, బయో లిక్కర్స్ వ్యవస్థాపకులు
రంజాన్ స్పెషల్ "రైస్ ఖీర్ పుడ్డింగ్" - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - Rice Kheer Pudding Recipe