ETV Bharat / state

సెకండ్‌హ్యాండ్​లో బండ్లు కొంటున్నారా - అయితే ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం - Bike Theft Cases in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 7:13 PM IST

Bike Thift Gang Arrest In Hyderabad : మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన ద్విచక్రవాహనం. ఏడాది కిందటే కొన్నాం. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం తక్కువ ధరకు విక్రయిస్తున్నాం. ఇలా గుర్తుతెలియని వ్యక్తులు, ఆన్‌లైన్‌ వేదికగా ఇచ్చే ప్రకటనలకు ఆకర్షితులయ్యారో బుక్కయినట్టే. చోరీ చేసిన బండ్లకు నకిలీపత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అమ్మేస్తున్నారు కేటుగాళ్లు.

Bike Thift Gang Arrest In Hyderabad
Bike Thift Gang Arrest In Hyderabad (ETV Bharat)

Bike Thift Gang Arrest In Hyderabad : సెకండ్‌హ్యాండ్‌ వాహనాలు కొనే సమయంలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని అవసరమైతే రవాణాశాఖ కార్యాలయంలో వాకబు చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో ఈ ఏడాది 8 నెలల్లో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న 30 మందికి పైగా అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 200 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 100 వాహనాలను నకిలీపత్రాలతో విక్రయించినట్టు గుర్తించారు.

రోజుకు ఐదు బండ్లు మాయం : నగరంలో 90లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలుంటాయని అంచనా. బైక్‌ట్యాక్సీ, ఇ-కామర్స్‌ వ్యాపారంతో యువతకు ఉపాధి లభిస్తోంది. కొత్త వాహనం కొనేందుకు రూ.లక్షకు పైగా వెచ్చించాలి. సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో కోరుకున్న బండి రూ.20వేల నుంచి లభ్యమవుతోంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర ముఠాలతో చేతులు కలిపిన స్థానిక దొంగలు బండ్లు కొట్టేస్తున్నారు. పాతబస్తీ శివారు ప్రాంతాల్లో మైనర్లకు కమీషన్‌ ఆశచూపి వారితో దొంగతనాలు చేయిస్తున్నారు. కేవలం సెకన్ల వ్యవధిలో తాళం తీయటం వారి ప్రత్యేకత. నగరంలో సగటున ప్రతిరోజూ 10 నుంచి 15 వాహనాలు మాయమవుతుండగా వాటిలో 5 నుంచి ఆరు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి.

బండికి రూ.10వేలు రాబడి : బండి మాయంచేసేందుకు ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయి. పాన్‌ దుకాణాలు, రహదారుల పక్కన, ఇంటి ముందుంచిన వాహనాలను తాళాన్ని తీసి కొద్దిదూరం నెట్టుకుంటూ వెళ్తారు. అనంతరం ఆటోల్లోకి చేర్చి తరలిస్తారు. ఒక్కోబైక్‌ను రూ.20-30వేలకు విక్రయిస్తారు. రవాణా, ఏజెంట్లకు కమీషన్‌ఇవ్వగా దొంగకు రూ.10వేలు మిగులుతాయని పోలీసుఅధికారి తెలిపారు. దొంగబండ్లను ఎక్కువగా చైన్‌స్నాచర్లు, అంతరాష్ట్ర దొంగలు, గంజాయి, రేషన్‌బియ్యం అక్రమతరలింపుల్లో ఉపయోగిస్తున్నారు.

"ఇంటి నుంచి కాస్తదూరం వెళ్లేందుకు సొంతవాహనం వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి. డబుల్‌లాకింగ్, ఇంధన సరఫరాకు తాళం వేయాలి. నిర్మానుష్య ప్రాంతాలు, సీసీ కెమెరాలు లేనిచోట వాహనాలు నిలపొద్దు. ఎక్కువ సమయానికి పెయిడ్‌ పార్కింగ్‌లు ఉత్తమం. అధీకృత డీలర్లవద్దే మారు బండ్లు కొనాలి."- సాధన రష్మి పెరుమాళ్, డీసీపీ

ఫ్యామిలీ మొత్తం చోరీలు చేసి బతికేస్తున్నారు - బైక్​ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

మీ బైక్​ పోయిందా? అయితే ఇక మర్చిపోవడమే! - ఎందుకో తెలుసా? - Bike Theft Cases in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.