ETV Bharat / state

వైభవంగా శ్రీరాముడి మహాపట్టాభిషేకం - ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ - Bhadradri Ramayya Coronation - BHADRADRI RAMAYYA CORONATION

Lord Rama Coronation at Bhadrachalam : రఘువంశ తిలకుడు, దశరథ నందనుడు, శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తముడిని భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. వేద మంత్రోచ్ఛరణలు, జయ జయద్వానాలు మార్మోగుతుండగా సింహాసనాన్ని అధిష్టించిన లోకాభిరాముడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు.

Lord Rama Coronation at Bhadrachalam
Lord Rama Coronation at Bhadrachalam
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 2:45 PM IST

Updated : Apr 18, 2024, 6:31 PM IST

వైభవంగా శ్రీరాముడి మహాపట్టాభిషేకం

Bhadrachalam Ramayya Pattabhishekam 2024 : జగమేలే జనార్ధనుడు జానకమ్మను మనువాడిన దృశ్యాలు మది నిండా ఉండగా మరుసటి రోజునే అంగరంగ వైభవంగా పట్టాభిషక్తుడై భక్తకోటికి అభయమిచ్చాడు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భద్రాచల మాఢవీధులు సర్వాంగ సుందరంగా మారగా నిత్యపూర్ణాహుతి అనంతరం దేవదేవుడు పల్లకిలో మిథిలా మండపానికి చేరుకున్నారు.

SRIRAMA NAVAMI 2024 : శ్రీరామ నామ స్మరణతో మిథిలా మండపం మార్మోగుతున్న వేళ సాగిన పట్టాభిషేక వేడుక ఆద్యంతం భక్తుల మదిని దోచింది. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో సాగిన విష్వక్సేన పూజ, పుణ్యహావచనం భక్తి భావాలు పంచింది. రామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు వర్ధిల్లిన తీరు, పాలకులకు ఆదర్శంగా నిలిచేలా అయోధ్యను పరిపాలించిన తీరును వైదిక పెద్దలు కొనియాడారు. గోదావరి పుణ్య జలాలు భక్తులపై చల్లి శుభాశిస్సులు అందించారు.

నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా సాక్షాత్కరించారు. భక్తరామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతపట్టి, కిరీటాన్ని ధరించి, ఛత్ర చామరాలతో కొలువుదీరిన రాములోరిని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్ఛరణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్టించిన రామచంద్రుడు భక్తకోటికి కొండంత అభయమిచ్చాడు.

భద్రాద్రి సీతమ్మకు కానుకగా త్రీడీ చీర - చూస్తే వావ్​ అనాల్సిందే! - Making Video of 3D Saree

హాజరైన గవర్నర్ : ఈక్రతువుకు హాజరైన గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. దశరథ నందనుడిని దర్శించుకుని తరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

వెల్లివిరిసిన మతసామరస్యం : మరోవైపు దర్గాలో దశరథ తనయుడి పట్టాభిషేకం మతసామరస్యానికి అద్భుత ఘట్టంగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణ పురంలోని హజరత్‌ నాగోల్‌ మీర్‌ దర్గాలో 12 ఏళ్లుగా శ్రీరామ నవమికి స్వామి వారి కల్యాణం ప్రత్యేకంగా జరుగుతోంది. అర్చకులు, దర్గా మాలిక్‌ల ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా ఈవేడుక కన్నులపండువగా సాగుతోంది.

ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణం - భక్తితో పులకించిన భద్రాచలం - sri ramanavami 2024

శ్రీరామనవమి స్పెషల్ - భద్రాద్రి సీతారాముల విగ్రహాలు 2వేల ఏళ్ల క్రితం నాటివట - వాటి విశిష్టత గురించి తెలుసా? - Sri Rama Navami Special 2024

Last Updated : Apr 18, 2024, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.