rachakonda police post on cyber crimes goes viral: ఈ మధ్య సైబర్ నేరాలు (Cyber Crimes) విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి సర్వం కోల్పొతున్నారు. అలాంటి ఘటనల్లో కోల్పొయిన డబ్బులు తిరి తీసుకురావడం అసాధ్యమైనా.. ముందస్తు జాగ్రత్తల ద్వారా సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా ఉంటారని పోలీసుు రాచకొండ పోలీసులు వినూత్న పద్దతిలో ప్రచారం చేస్తున్నారు.
ఈ మోసాల గురించి మరింత అర్థవంతంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు (Rachakonda Police)ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్‌తో ప్రజలను హెచ్చరించారు. ‘‘బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి.. తెలివిగా ఆలోచించండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
రావుగారు రిటైర్ అయ్యారు
- పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. రూ. 20 లక్షలు. తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు.
- ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి పచ్చారు. సోఫాలో పడివున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. సోఫాలో కూర్చొని భార్యను "ఫోన్ వచ్చిందా?" అని అడిగారు.
- "అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్' అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని" రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో " ఒ.టి.పి. ఇచ్చావా..?" అని భార్య: అవును. బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను.
- రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి.
- "ఏ ఓటీపీ ఇచ్చావు" అని అడిగారు.
- భార్య అమాయకంగా చెప్పింది " ఓటీపీ 4042గా వచ్చింది. జాయింట్ అకౌంట్ కదా. నా వంతు ఓటీపీ ( 2021)
- రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది.. అందుకనే కదా అర్ధాంగి అంటారు..!
ప్రస్తుతం తెలంగాణాలో సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయి. సాధారణ నేరాల కంటే అత్యధికంగా నమోదవడమే కాకుండా కోట్ల రూపాయలు సొత్తు నేరగాళ్లు కాజేస్తున్నారు. గత మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే రాజధానిలో సగటున 9 నుంచి 10 వేల మధ్య ఇళ్లల్లో దొంగతనాలు, వాహన, సెల్‌ఫోన్ చోరీలు రికార్డు కాగా, సైబర్ నేరాల సగటు పెరుగుదల 10-15 శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. బాధితులు పోగొట్టుకునే సొత్తు రూ. వందల కోట్లలో ఉంటోంది. ఒక్క 2023లో నగరంలోని మూడు కమిషనరేట్లలో కలిపి సుమారు రూ.450 కోట్లు పోగొట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తక్కువ ధరకే బంగారం - నమ్మారో నట్టేట మునగడం ఖాయం - బీ కేర్ ఫుల్! - FAKE GOLD SCAM in hyderabad