ETV Bharat / state

మొన్న చెడ్డి గ్యాంగ్​, నిన్న ధార్ ముఠా, నేడు భవారియా బ్యాచ్ ​- హైదరాబాద్​ పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠాల సవాల్‌ - Bawaria Chain Snatchers gang - BAWARIA CHAIN SNATCHERS GANG

Bawaria Chain Snatchers gang Hulchul in Hyderabad : హైదరాబాద్​లో ఉత్తరప్రదేశ్​కు చెందిన భవారియా గ్యాంగ్‌ పంజా విసిరుతోంది. ఒక్క రోజులోనే నాలుగు చోట్ల చైన్​ స్నాచింగ్​లకు పాల్పడింది. జవహర్‌నగర్, చీర్యాల, శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వరుసగా చోరీలు చేశారు. తర్వాత గజ్వేల్‌ వరకూ వెళ్లి అక్కడ మరో గొలుసు కొట్టి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అంతర్రాష్ట్ర ముఠాలపై అధికారులు దృష్టి పెట్టారు.

Chain Snatchers gang Hulchul in Hyderabad
Bawaria Chain Snatchers gang Hulchul in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 10:30 AM IST

Bawaria Chain Snatchers gang Hulchul in Hyderabad : రాష్ట్రంలో భవారియా గ్యాంగ్​ మరోసారి విరుచుకుపడింది. హైదరాబాద్​ నగర శివార్లలో కిరాతకమైన ధార్​ గ్యాంగ్​ అలజడి మర్చిపోయే లోపే ఉత్తరప్రదేశ్​లోని షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్‌ సభ్యులు శనివారం ఒక్క రోజే నాలుగు చోట్ల చైన్​ స్నాచింగ్​లకు పాల్పడ్డారు. బైక్​ మీద ఇద్దరు దుండగులు వచ్చి చోరీకి పాల్పడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబద్​లోని ఇద్దరు దుండగులు నకిలీ రిజిస్ట్రేషన్​ నంబరుతో జవహర్​నగర్​ చీర్యాల, శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వరుసగా చోరీలు జరిగాయి. ఇవన్ని శనివారం ఒక్కరోజే ఒకే గ్యాంగ్​కు చెందని నిందితులు చేశారు. తర్వాత వారు గజ్వేల్​ వరకూ వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. గజ్వేల్​లో కనిపించిన గంటల వ్యవధిలోనే చీర్యాలలో మరో గొలుసు చోరీ చేశారు. తర్వాత ఎటువైపు వెళ్లారో ఆచూకీ చిక్కలేదు. సిద్ధిపేట, రాచకొండ, సైబరాబాద్‌ సహా వివిధ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనం అదృశ్యం కేసులపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రలోని సోలాపూర్​లో భవారియా ముఠా వరసగా చైన్​ స్నాచింగ్​లకు పాల్పడింది. వారిలో కొంత మంది వ్యక్తులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

80 ఏళ్ల బామ్మ మెడలో చైన్​ కొట్టేసిన దుండగులు - గొలుసు విలువ ఎంతో తెలుసా?

UP Bawaria Gang Cases in Telangana : గతేడాది జనవరి 7న హైదరాబాద్, రాచకొండ పరిధిలో ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు రెండు గంటల వ్యవధిలో ఆరు చైన్‌ స్నాచింగ్‌లు చేశారు. నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా ముఠాగా పోలీసులు గుర్తించారు. వరుస దోపిడీల అనంతరం ఉత్తరప్రదేశ్‌కు పరారయ్యారు. ఆ గ్యాంగ్​ ఆచూకీ కోసం ఉత్తరప్రదేశ్​, దిల్లీలో ప్రత్యేక బృందాలు రోజుల తరబడి శ్రమించారు. ఇప్పుడు అదే ముఠా సభ్యులు రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో నాలుగు దొంగతనాలు చేశారు. వరుస దోపిడీలతో హడలెత్తించే అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి మళ్లీ తలెత్తిందని నిపుణలు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమీన్​పూర్​లో చైన్​ స్నాచింగ్ - సీసీటీవీ దృశ్యాలు వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.