ETV Bharat / state

బెంగళూరు రేవ్​పార్టీలోనూ వైఎస్సార్సీపీ హస్తం!- నిందితులతో పార్టీ నేతలకు లింకులు - Rave Party Accused Links with YSRCP - RAVE PARTY ACCUSED LINKS WITH YSRCP

Bangalore Rave Party Accused Links with YSRCP Leaders : బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏ-2గా ఉన్న అరుణ్‌కుమార్‌ సీఎం జగన్‌, రాయచోటి ఎమ్మెల్యే (MLA) శ్రీకాంత్‌ రెడ్డితో దిగిన ఫొటోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఉంటూ వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలు ఉండటం వల్లే వారితో ఫొటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది.

bangalore_rave_party_accused_links_with_ysrcp_leaders
bangalore_rave_party_accused_links_with_ysrcp_leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 7:45 AM IST

Bangalore Rave Party Accused Links with YSRCP Leaders : కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడవనేరికి చెందిన నిందితుడు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అధికారపార్టీ నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏ-2గా ఉన్న అరుణ్‌కుమార్‌ సీఎం జగన్‌, రాయచోటి ఎమ్మెల్యే (MLA) శ్రీకాంత్‌ రెడ్డితో దిగిన ఫొటోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఉంటూ వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలు ఉండటం వల్లే వారితో ఫొటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ వద్ద ఓ వాహనంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట MLA అనే స్టిక్కర్ ఉండటం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన బుకీ లంకలపల్లి వాసును పోలీసులు ఏ1గా చేర్చారు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విజయవాడ వ్యక్తి మరొకరు- రిమాండ్​లో నిందితులు - RAVE PARTY CASE

బెంగళూరు రేవ్​పార్టీలోనూ వైఎస్సార్సీపీ హస్తం!- నిందితులతో పార్టీ నేతలకు లింకులు (ETV Bharat)

Tollywood Cctress inRave Party : ఏ2 అరుణ్‌కుమార్ కావడం ఆయనకు అధికారపార్టీతో లింకులు ఉండటం సంచలనమైంది. విజయవాడ వన్ టౌన్‌కు చెందిన డి. నాగబాబును ఏ-3గా ఎఫ్​ఐఆర్​ (FIR) లో చేర్చారు. ఈ ముగ్గురిలో అరుణ్‌కుమార్‌కే వైఎస్సార్సీపీతో సంబంధాలు ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. రేవ్ పార్టీలో పలు మాదకద్రవ్యాలు వినియోగించారనేదానిపై విచారణ జరిపిన పోలీసులు ఆ పార్టీలో పలు ప్రమాదకరమైన మత్తు పదార్థాలు వినియోగించినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. పలువురు టాలీవుడ్​యాక్టర్లు ఈ బెంగళూరు రేవ్​ పార్టీలో పాల్గొన్నారనేదానిపై సర్వత్రా సంచలనం రేపింది. కాగా డ్రగ్స్​ టెస్ట్​లో పాజిటివ్​ రావడం మరింత ఉత్కంఠ రేపింది.

కాకాణికి రేవ్ పార్టీతో సంబంధం లేకుంటే ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు దొరికింది: సోమిరెడ్డి - BANGALORE RAVE PARTY

హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వ్యాపారం చేసే అరుణ్‌కుమార్‌ను వైఎస్సార్సీపీ నేతలు తరచూ కలుస్తుంటారు. ఇప్పటికే ఈ కేసులో లంకలపల్లి వాసుతో పాటు అరుణ్‌కుమార్‌ను ఈ నెల 21న బెంగళూరు పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానంలో హాజరుపరిచి తర్వాత పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు.

బెంగళూరు రేవ్‌ పార్టీ నిందితుడు బెట్టింగ్ వాసు - చీకటి సామ్రాజ్యం మాములుగా లేదుగా - Bangalore Rave Party Accused

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.