ETV Bharat / state

రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీ నేతలను ఎందుకు పిలువలేదు : బండి సంజయ్ - bandi sanjay

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 4:31 PM IST

Bandi Sanjay Fires on CM Revanth : రాష్ట్ర అధికారిక కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి, దిల్లీ వెళ్లి సోనియాను ఎలా కలుస్తారని బీజేపీ నేత బండి సంజయ్‌ మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీ నేతలను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద సీఎం రేవంత్‌కు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందని, కేసీఆర్‌ ఎక్కడ ఉన్నా వెతికి మరీ ఆహ్వానం ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు.

BANDI SANJAY ON PHONE TAPPING CASE
Bandi Sanjay Fires on CM Revanth (Etv Bharat)

Bandi Sanjay Fires on CM Revanth : సోనియా గాంధీ బలిదేవతని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, అలాంటిది ఇవాళ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను ఎలా ఆహ్వానిస్తారని బీజెేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి, దిల్లీ వెళ్లి సోనియాను ఎలా కలుస్తారని ఆయన మండిపడ్డారు. సోనియాగాంధీ వల్లే అనేక మంది యువత చనిపోయారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీ నేతలను ఎందుకు పిలవలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద సీఎం రేవంత్‌కు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందని, కేసీఆర్‌ ఎక్కడ ఉన్నా వెతికి మరీ ఆహ్వానం ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను కేసీఆర్‌ గాలికొదిలేశారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.

మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​ కేసుపై సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్​ లేఖ రాశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆ లేఖలో గుర్తు చేశారు. ఆ జీవోను రద్దు చేయాలని బండి సంజయ్​ కోరారు. కేటీఆర్​, కేసీఆర్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం నడిపించారని బండి సంజయ్​ ఆరోపించారు. వారిద్దరికీ నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని బండి సంజయ్​ లేఖలో ప్రస్తావించారు.

ఫోన్​ట్యాపింగ్ కేసును నీరుగారిస్తే బీఆర్ఎస్​కు పట్టిన గతే కాంగ్రెస్​కు పడుతుంది​ : ఎంపీ లక్ష్మణ్‌ - mp lAxman on phone Tapping Case

జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాపింగ్​ - పర్సనల్ డేటా సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర - JUDGES PHONE TAPPING IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.