ETV Bharat / state

ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి : బండి సంజయ్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 10:52 PM IST

Updated : Jan 19, 2024, 11:48 PM IST

Bandi Sanjay asked holiday on 22nd January in Telangana : ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌(Bandi Sanjay) విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లందకుంటలో ఉన్న సీతారామ మందిరాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Bandi Sanjay on Ayodhya Ram Mandir Arrangements
Bandi Sanjay asked holiday on 22nd January in Telangana

Bandi Sanjay Visit Rama Temple : రాముల వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. తనతో పాటు వచ్చిన నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అయోధ్య ఆలయ రామ మందిరం నిర్మాణంలో విరాళాల సేకరణలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించి ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు బాస్మతి అక్షింతలు కావాలంటే ప్రత్యేకంగా తయారు చేసి రాముల వారి దగ్గర పెట్టి ఇస్తామని ఎద్దేవా చేశారు.

కేసీఆర్​కు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్

Bandi Sanjay on Ayodhya Ram Mandir Arrangements : కొంత మంది అధికారులు స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 22న సమీక్ష సమావేశాలు, మీటింగ్‌లు పెడుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఇది పవిత్ర కార్యక్రమం అని పార్టీలకు చోటు లేదని అన్నారు. ఆరోజున ప్రత్యక్షంగా చూసేందుకు ప్రత్యేక తెరలు ఏర్పాటు చేస్తామని, అందులో ప్రత్యక్ష ప్రసారం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అందరూ ఆ రోజున అయోధ్యకు వస్తే రద్దీ పెరుగుతోందని సలహా ఇచ్చారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శనానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

Bandi Sanajay comments on CM KCR : 'ధరణి బాధితులతో.. సభ నిర్వహిస్తే పరేడ్​గ్రౌండ్​ నిండిపోతుంది'

Bandi Sanjay on Ayodhya Ram Mandhir : గురువారం బండి సంజయ్‌ అయోధ్య సీతారామ ఆలయానికి బంగారు చీరను ఇవ్వనున్న నేతన్న హరిప్రసాద్‌ను కలిశారు. అనంతరం ఆ చీరను పరిశీలించి, కళాకారుడిని అభినందించారు. ఆ బంగారు చీరలో రామాయణంలోని జరిగిన సంఘటనలు అద్భతంగా వేశారని సంజయ్ తెలిపారు. హరిప్రసాద్ ప్రతిభను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అగ్గిపెట్టలో చీర పట్టేలా తయారు చేసింది సిరిసిల్ల జిల్లాలోనే అని తెలిపారు. ఈ నెల 22న జరిగే అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర దీపాలు వెలిగించి విజయవంతం చేయాలని కోరారు.

భాజపాకు ఓటు వేసి లాయర్ల తడాఖా చూపించండి: బండి సంజయ్​

Last Updated : Jan 19, 2024, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.