ETV Bharat / state

బల్కంపేట ఎల్లమ్మ నూతన ఉత్సవ కమిటీని వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్​ నాయకులు - Balkampet yellamma temple Issue

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 5:19 PM IST

Balkampet yellamma temple Issue : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ నిర్వాహణ కోసం ఏర్పాటు చేసిన నూతన కమిటీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలో కేవలం 5 మంది స్థానికులకు అవకాశం కల్పిస్తూ 9 మంది స్థానికేతరులను నియమించడం గ్రూపులను ప్రోత్సహించడమేనని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ డివిజన్​ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఈవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే ఈ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Balkampet yellamma temple Issue
Balkampet yellamma temple Issue (ETV Bharat)

Balkampet yellamma temple Issue : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహణ కోసం నూతనంగా దేవాదాయ శాఖ ప్రకటించిన ఉత్సవ కమిటీని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డివిజన్​ అధ్యక్షుడు శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఈవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కమిటీని రద్దు చేయాలని కోరుతూ ఈవో అంజనీదేవికి వినతిపత్రం సమర్పించారు.

స్థానికేతరులను నియమించడంపై కాంగ్రెస్​ నాయకుల ఆగ్రహం : సనత్​నగర్ నియోజకవర్గం ఇంఛార్జ్​ చోట నీలిమ పంపిన పేర్లు కాకుండా స్థానికేతరుల పేర్లు ప్రకటించడం సరైనది కాదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 14 మంది పేర్లతో కూడిన జాబితాను పంపిస్తే కేవలం 11 మందితో ఉత్సవ కమిటీని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ స్థానికులను అవమానించడమేనని శ్రీనివాసరావు, శంకర్​ గౌడ్​లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

9 మంది స్థానికేతరులనే నియమించారు : కేవలం 5 మంది స్థానికులకు అవకాశం ఇస్తూ 9 మంది స్థానికేతరులను కమిటీలో నియమించడం గ్రూపులను ప్రోత్సహించడమేనని దుయ్యబట్టారు. ఈ కమిటీని రద్దు చేయాలని కోరుతూ ఈవో అంజనీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదాస్ నవీన్, కడవారి లక్ష్మన్, పద్మావతి, ఆండాల్, సుకన్య, రాజా పద్యరాణి, అనితా సింగ్ తదితరులు ఉన్నారు.

"బల్కంపేట కల్యాణ కమిటీలో బస్తీవారిని కాకుండా స్థానికేతరులను నియమించడం ఎంతవరకు సమంజసం. పాసులు ఎవరికీ ఇచ్చేది లేదని అంటున్నారు. బోర్డు మెంబర్లు 14 మందిలో ఆరుమందిని ఇతర ప్రాంతాల వారిని వేశారు. బయటివారిని కల్యాణకమిటీలో వేస్తే జనాలను లోపలివాళ్లు ఏ విధంగా గుర్తుపట్టాలి అనే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం" - సేవాదల్ ప్రెసిడెంట్

Members of Balkampet Ellamma Committee : ఈ నెల 9న జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు గాను దేవాదాయ శాఖ నూతన ఉత్సవ కమిటీని నియామిస్తూ శుక్రవారం జారీ చేసింది. సభ్యులుగా ఎస్, శ్రీనివాసరెడ్డి, గోదేసి అజయ్, చుక్క బాబు, పోతరాజు భాస్కర్, మిర్యాల నవీన్ కమార్, మరియగడ్డ మహేష్, కె, పద్మరాణి, సంగబోయి శ్రీనివాస రావు, అనితా సింగ్ వై చక్కధర్ యాదవ్, గోకుల్ రాకేశ్ యాదవ్​లు ఉన్నారు.

బల్కంపేట అమ్మవారికి గుడిలోనే పట్టుచీరలు సిద్ధం చేసిన పోచంపల్లి నేత కార్మికులు

వైభవంగా జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. భక్తులకు తప్పనిపాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.