Balineni Srinivasa Reddy Election Nomination: ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. కర్నూలు ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నుంచీ భారీ ఊరేగింపుగా చర్చిసెంటర్ వరకూ వెళ్లారు. అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసారు. పెద్ద ఎత్తులో కార్యకర్తలకు, ద్వాచక్రవాహనచోదకులకు పెట్రోలు కొట్టించి ర్యాలీలో పాల్గొనేవిధంగా ఏర్పాట్లు చేసారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సమీపంలో బ్యారకేట్లు పెట్టి ర్యాలీనిని నిలుపదల పచేసినప్పటికీ, బ్యారకేట్లను విరగగొట్టి కొంత దూరం చొచ్చుకువచ్చారు. ర్యాలీలో వైసీపీ కార్యకర్తల అతి ప్రవర్తన జనానికి ఇబ్బందిగా మారింది.
బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసేందుకు ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలను పెద్ద ఎంత్తున తరలించారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంగా ఒంగోలు - కర్నూలు రోడ్డు ఫై ఒవర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా, ట్రంక్ రోడ్డు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బారీ గేట్లు, బందోబస్ ఏర్పాటు చేశారు. అయితే, బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేయడానికి కారులో లోపలికి వెళ్లారు. అదే సమయంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్నికల కోడ్ లెక్కచేయకుండా కలెక్టరేట్ లోకి వేళ్లే ప్రయత్నం చేశారు. వారిని అదుపుచేయాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ పోలీసులు వైసీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి వరకూ సీఆర్పీఎఫ్ పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
షెడ్యూల్‌కు ముందే వైసీపీ తాయిలాల పర్వం - ఆసరా సభలో చీరలు పంపిణీ
ఇక బాలీనేను నామినేషన్ వేస్తున్న సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలను తరలించారు. అయితే, బాలీనేని నామినేషన్ పూర్తి అయ్యే వరకూ ర్యాలీ కోసం తీసుకువచ్చిన ప్రజలను ఎటూ కదలనివ్వలేదు. కనీసం వారికి మంచి నీరు అందించే ఏర్పాటు చేయలేదు. తాగడానికి వాటర్ బాటిల్స్ అరాకొర తీసుకురావడంతో, ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. ర్యాలీ అయ్యే కోసం అని తీసుకువచ్చి కనీసం మంచి నీరు కూడా ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఎండలు మండిపోతున్నా, తమవైపు చూసే నాయకులు లేరంటూ విమర్శలు గుప్పించారు. మరో వైపు బైక్, కార్లతో ర్యాలీలో పాల్గొన్న వారికి పెట్రోల్ కొట్టించారు.
ఇవే నాకు చివరి ఎన్నికలు - దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుంది: బాలినేని