Bala Latha Fires on IAS Smita Sabharwal : 24 గంటల్లో దివ్యాంగుల రిజర్వేషన్లపై స్మితా సభర్వాల్ పెట్టిన పోస్ట్ వెనక్కి తీసుకోకపోతే జైపాల్‌రెడ్డి స్మృతివనం వద్ద అమరణ నిరాహార దీక్ష చేపడతామని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ బాలలత హెచ్చరించారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన స్థాయిలో ఉండి సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను వద్దనటం స్మితా సభర్వాల్ లాంటి అధికారికి తగదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆమె అన్నారు. ఏ సర్వీస్‌లోకి ఎవర్ని తీసుకోవాలో చెప్పటానికి ఆమె ఎవరని ప్రశ్నించారు.
సివిల్ సర్వెంట్స్ కేవలం ప్రజా సేవకులు మాత్రమేనని మాస్టర్స్ కాదని బాలలత అన్నారు. స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ కొన్ని లక్షల మంది చదివారని, అది కొన్ని వేల మందిపై ప్రభావం చూపుతుందని ఈ తరహా పోస్టుల వల్ల దివ్యాంగులకు ప్రైవేటు సెక్టారులో ఉద్యోగాలు వస్తాయా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లవల్లే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంతో మంది ఐఏఎస్‌లను తయారు చేశానని చెప్పారు. చట్ట వ్యతిరేకమైన ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా సభర్వాల్ చేసిన పోస్టు మొత్తం దివ్యాంగ సమాజాన్నే అవమానించిందని క్షమాపణ చెప్పిన తర్వాతే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
లోకేశ్ ఛాంబర్లో బీజేపీ నేతలు- తమ పార్టీలో వైసీపీ నేతల చేరికలపై చర్చ
ట్వీట్‌పై దుమారం : మహారాష్ట్రలో మాజీ ట్రైనీ పూజా ఖేడ్కర్, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా నేపథ్యంలో స్మితా సభర్వాల్ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో దివ్యాంగులను గౌరవిస్తూనే విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని, ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుందని, ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరమని, ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? అని అడుగుతున్నానంటూ ట్వీట్ చేశారు.
అయితే స్మితా సభర్వాల్ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ‘‘వైకల్యం అనేది శక్తి, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదని అన్నారు. ఈ పోస్టు చూస్తోంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ కరుణ ఘాటుగా సమాధానమిచ్చారు. "ఈ పోస్ట్ చూస్తోంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోంది" అని ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు.
'ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు గుర్తుపెట్టుకో'- అసెంబ్లీ వద్ద జగన్నాటకం - Jagan Warning to Police
హాయ్ రఘురామ- హాల్లో జగన్! అసెంబ్లీలో ఆసక్తికరంగా ఆ ఇద్దరి సంభాషణ - ys jagan raghu rama conversation
As this debate is blowing up-
— Smita Sabharwal (@SmitaSabharwal) July 21, 2024
With all due respect to the Differently Abled. 🫡
Does an Airline hire a pilot with disability? Or would you trust a surgeon with a disability.
The nature of the #AIS ( IAS/IPS/IFoS) is field-work, long taxing hours, listening first hand to…