ETV Bharat / state

చదవకుండా డిగ్రీ సర్టిఫికెట్ పొందుతున్నారా? - దానివల్ల ఎన్ని సమస్యలో తెలుసా?

చదవకుండా డిగ్రీ సర్టిఫికెట్ పొందుతున్నారా - ప్రైవేట్ యూనివర్సిటీల్లో వెనక తేదీల్లో పాస్‌ అయినట్లు తీసుకుంటున్నారా- దానివల్ల లాభాలా, నష్టాలా?

Backdated Degree Certificate From Private Universities
Backdated Degree Certificate From Private Universities (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 24 minutes ago

Backdated Degree Certificate From Private Universities : నాకు తెలిసిన ఒక అక్క ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రమోషన్‌ కోసం ట్రై చేస్తున్నారు. తను చదివింది ఇంటర్‌ మాత్రమే. అందుకు ఆమెకు డిగ్రీ సర్టిఫికెట్ కావాలి. ఒక ఏజెంట్‌ ద్వారా తను ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి వెనక తేదీల్లో పాస్‌ అయినట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. అలా తీసుకుంటే ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగాలు పొందవచ్చా? భవిష్యత్తులో సమస్యలు ఏమైనా వస్తాయా? దీనిపై కెరియర్ కౌన్సెలింగ్ నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.

ఎక్కడా పనికి రావు : ఇప్పటి కాలంలో ఇంటర్, డిగ్రీ డబ్బులతో కొంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. దీని వల్ల చదివిన విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకా సర్టిఫికెట్ విషయానికి వస్తే ఏ యూనివర్సిటీ అయినా ఒక అకడమిక్‌ ప్రోగ్రాంలో ప్రవేశం పొందకుండా, చదవకుండా, పరీక్షలు రాయకుండా వెనక తేదీల్లో సర్టిఫికెట్లు జారీ చేయడంలో సహకరించిన ఏజెంట్లు, కొన్నవారు అందరూ నేరం చేసినట్లే. ఉదాహరణకు ఒక వ్యక్తి వైద్య కలేజీలో ప్రవేశం పొందకుండా, మోసపూరితంగా సంపాదించిన సర్టిఫికెట్‌తో మెడికల్‌ ప్రాక్టీస్ పెడితే అతని దగ్గర చికిత్స చేయించుకోవడం ఎంత ప్రమాదం ఇలా ఆలోచించాలి. బాగా చదివి, విజ్ఞానం పెంపొందించుకుని సర్టిఫికెట్లు సంపాదించుకోవాలి కానీ విద్యాపరమైన సర్టిఫికెట్లను మార్కెట్లో కొనకూడదు. అలా కొనుక్కొన్నవి ఎక్కడా ఉపయోగపడవు. ఇందుకు చదివి సర్టిఫికెట్ సాధించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరీక్షల్లేవ్‌, ఫొటోషాప్‌తో పాస్‌, నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​

ఎక్కవ కాలం కొనసాగలేరు : తప్పుడు పద్ధతిలో సర్టిఫికెట్‌ పొందిన అపరాధ భావన, తప్పు చేసినట్లు రుజువైతే ఉద్యోగం పోవడం పాటు నేరం చేసినందుకు శిక్ష కూడా అనుభవించాల్సిందే. ఆ భయం జీవితాంతం ఉంటుంది. మరోవైపు చాలామంది ఇలా డిగ్రీ, పీజీలు మార్లెట్లో కొనుక్కొని మోసపోతూనే ఉన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం అసాధ్యం. కొన్ని సార్లు బ్యాంక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌లో వాళ్లు చదివారా లేద అన్ని విషయం తెలిసిపోతుంది. ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సాధ్యమైనా అలా పొందిన ఉద్యోగం ఎంతోకాలం ఉండదు.

నకిలీ ధ్రువపత్రాలు తయారుచేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు

ఫేక్ సర్టిఫెకెట్లతో ఏటా రూ.20 కోట్లు.. అదే వారి టార్గెట్‌

Last Updated : 24 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.