ETV Bharat / state

ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏంటి? - ఈ కార్డుతో క్యూలో నిలబడే కష్టాన్నిఎలా తప్పించుకోవచ్చు? - AYUSHMAN BHARAT HEALTH CARD - AYUSHMAN BHARAT HEALTH CARD

Ayushman Bharat Health Card Distribution : దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల సృష్టి, వాటి ద్వారా వైద్య సేవలు ప్రారంభమై ఏడాది గడుస్తోంది. కాని ఇప్పటికీ ఆభా కార్డులు లేని వాళ్లు, వాటి ద్వారా వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో ఆభా కార్డుల జారీ ప్రస్తుతం ఊపందుకుంటోంది. ఆసుపత్రికి వచ్చిన ఓపీలకు సిబ్బంది ఉచితంగా ఆభా కార్డులు జారీ చేస్తున్నారు. దీంతో క్యూలో పడిగాపులు పడకుండా స్కిప్ ద క్యూ సేవలు సైతం ఆందుబాటులోకి వచ్చాయి. మరీ ఆభా కార్డు ఏంటి, దాని ద్వారా క్యూలో నిలబడే కష్టాన్ని ఎలా తప్పించుకోవచ్చో ఈ కథనంలో చూద్దాం.

Ayushman Bharat Health Account Card Distribution
Abha Health Card Distribution (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 9:49 AM IST

ప్రభుత్వాసుపత్రుల్లో ఊపందుకుంటున్న ఆభాకార్డుల జారీ - అందుబాటులోకి స్కిప్ ద క్యూ సేవలు (ETV Bharat)

Ayushman Bharat Health Card Distribution in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ జోరుగా కొనసాగుతోంది. గత ఏడాది జులై నుంచే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్​లో భాగంగా ఆభా కార్డుల జారీ కొనసాగుతున్నా ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది. వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఉచితంగా ఆభా కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఏ ప్రభుత్వాసుపత్రిలోనైనా ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. 5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది.

దీంతో పాటు రోగి ఆరోగ్య చరిత్ర మొత్తం ఈ ఖాతాలో నిక్షిప్తమై ఉంటుంది. ఒకసారి ఖాతా తెరిచాక రోగి ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా, పూర్వ ఆరోగ్య చరిత్ర అంటే ఏ ఆసుపత్రులకు వెళ్లారు, ఏ రోగానికి చికిత్స తీసుకున్నారు, ఏ మందులు వాడారు, ఏ పరీక్షలు చేసుకున్నారు. ఇలాంటివన్నీ ఆ ఖాతాలో నమోదై ఉంటాయి. దీనివల్ల వైద్యులకు రోగి సమస్యను అర్థం చేసుకోవడం, వైద్యం చేయడం సులువవుతుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, కోస్గీ సర్కారు దవాఖానాల్లో ఆభా కార్డుల జారీతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ సేవల్ని అందిస్తున్నారు.

స్కిప్ ద క్యూ సేవలు : ఆభా సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్‌లోని సమాచారంతోనే ఆభా కార్డు జారీ అవుతుంది. ఆభాలోని సమాచారాన్ని ఆసుపత్రితో పంచుకుంటే, రోగికి సీఆర్​ నంబర్ వస్తుంది. ఇది రోగికి శాశ్వత సంఖ్య. ఆభా కార్డు పొందిన వాళ్లు ఏ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందినా శాశ్వత సీఆర్​ నంబర్ పైనే నమోదు అవుతుంది. ఆభా ఖాతా ఉంటే ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంటి దగ్గరి నుంచి లేదా ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యూఆర్​ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బయటి రోగులు టోకెన్లు పొందొచ్చు. అందుకోసం ముందుగా ఆభా యాప్‌ను మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఓపీ కౌంటర్‌లో టోకెన్ నంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు. ఆసుపత్రి క్యూఆర్​ కోడ్‌ను ఫోన్‌లో భద్రపరిచి పెట్టుకుంటే ఇంటి దగ్గరి నుంచే టోకెన్ నంబర్లు జనరేట్ చేసుకోవచ్చు. సాధారణంగా గతంలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో రోగికి 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టేది. అలా కాకుండా టోకెన్ నంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు. ఈ విధానం వల్ల రోగి క్యూలైన్లలో వేచి ఉండకుండా నేరుగా వైద్యుని కోసం వెళ్లొచ్చు.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 43 వేల 306 మందికి ఆభా కార్డులు మంజూరు చేశారు. వారిలో 3 వేల 439 మంది మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వైద్య సేవలు నేరుగా పొందుతున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లేని వాళ్లు చాలా తక్కువ. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వాళ్లంతా యాప్‌ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ సేవలు పొందితే సిబ్బందిపై భారం తగ్గనుంది.

'కేంద్ర ప్రభుత్వం ఆభా అనే స్కీమ్​ తెచ్చింది. ఆభా అంటే ఆయుష్మాన్ భారత్. దీని ద్వారా ఒక పేషెంట్​కు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల బీమా వస్తుంది. ఇది ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఉపయోగపడతోంది. దీన్ని ఫోన్​ ద్వారా కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు సీఆర్​ నంబర్​ జనరేట్​ అవుతుంది. దాని వల్ల మనం ఎక్కడికి వెళ్లినా ఆ నంబర్​ ద్వారా మన వివరాలతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్​లు కూడా వస్తాయి'- ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ 'హెల్త్‌ కార్డు - డిజిటల్‌ రికార్డు'! - కార్యాచరణపై సర్కార్ కసరత్తు

How to Download Ayushman Bharat Card : మీకు "ఆయుష్మాన్ భారత్" కార్డు ఉందా ? రూ.5 లక్షల దాకా ఉచిత వైద్యం.. ఇలా పొందండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.