ETV Bharat / state

సింగపూర్​లో​ అయోధ్య శ్రీ రాముని అక్షింతల వితరణ కార్యక్రమం

టీసీఎస్​ఎస్​ సొసైటీ​ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ రాముని అక్షింతల వితరణ - చాంగి గ్రామంలో ఉన్న శ్రీ రాముని గుడిలో వైభవంగా కార్యక్రమం - కార్యక్రమానికి భారీగా హాజరైన స్థానిక భారతీయులు

SRI RAMA TEMPLE IN SINGAPORE
CHANGI VILLEGE IN SINGAPORE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 5:10 PM IST

Updated : Oct 10, 2024, 5:17 PM IST

Sri Rama Temple in Singapore: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు భారత దేశం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన అయోధ్య శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట అక్షింతలను సింగపూర్​లో నివసిసిస్తున్న భక్తులకు అందజేశారు. చాంగి గ్రామంలో ఉన్న శ్రీ రాముని గుడిలో ఎంతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్​లోని దేవాలయాల్లో ఈ ప్రక్రియ నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన అదృష్టం అని సొసైటీ సభ్యులు తెలిపారు.

ఈ పవిత్ర కార్యంలో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామస్మరణ చేస్తూ పాల్గొని అక్షింతలతో పాటు ప్రసాదం స్వీకరించి శ్రీ రాముని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా జై శ్రీ రామ్ నామస్మరణతో మారుమోగింది. ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు శ్రీ రాముని సేవలో భక్తితో పరవశించిపోయారు.

శ్రీ రామ నామాలు జమ చేసే బ్యాంక్​ - ఖాతాదారులకు సర్టిఫికెట్- ఎక్కడ ఉందంటే?

ఈ మహోత్సవంలో సుమారు ఒక వెయ్యి మంది వరకు భక్తులు పాల్గొని అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతలను స్వీకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సింగపూర్​లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు సొసైటీ స్థాపన నుంచి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీని స్థానికులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున శ్రీరాముని సేవలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ మొదలైన వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

భారత్ నుంచి ఈ పవిత్ర అక్షింతలను సింగపూర్​కి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిన గోనె నరేందర్ రెడ్డికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అక్షింతల వితరణ కార్యక్రమం తమ ఆలయంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీరామ ఆలయ అధికారులు తెలిపారు.

Last Updated : Oct 10, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.