ETV Bharat / state

వంటగదిలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - పిల్లల అనారోగ్యానికి కారణం ఇవే కావొచ్చు! - కిచెన్ మేనేజ్ మెంట్

Common Kitchen Mistakes: మనం హెల్దీగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కలుషిత ఆహారం ఇబ్బందుల పాల్జేస్తుంది. కిచెన్​లో మనం చేసే కొన్ని పొరపాట్లు తినే ఆహారాన్ని కలుషితం చేసి, లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. తెలియకుండా జరిగే ఈ మిస్టేక్స్ సరిదిద్దుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. మరి.. ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం..

kitchen mistakes
kitchen mistakes
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 4:12 PM IST

Avoid These Common Kitchen Mistakes: ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడంలో వంటగది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిని ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అనారోగ్యాల్ని కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సింక్‌ను శుభ్రంగా ఉంచుకోకపోవడం : మీరు తీసుకునే ఆహారం కలుషితంగా మారడంలో సింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మీకు తెలియకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతుంది. అప్పుడు వాటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సింక్​ను శుభ్రంగా ఉంచుకోవాలి.

స్పాంజ్​లు మార్చకపోవడం : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. వంటపాత్రలను శుభ్రం చేసే స్పాంజ్​లు నెలల తరబడి యూజ్ చేస్తుంటారు. కానీ, అది మంచిది కాదు. ఎందుకంటే అవి బ్యాక్టీరియా వ్యాప్తికి స్వర్గధామం. కాబట్టి తరచుగా వాటిని మార్చడం ముఖ్యం.

కత్తుల విషయంలో అజాగ్రత్తగా ఉండడం : కిచెన్​లో​ కూరగాయలను కట్ చేయడానికి యూజ్ చేసే కత్తులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వాటిపై పురుగులు, కీటకాలు తిరుగుతుంటాయి. అప్పుడు కడగకుండా అలాగే యూజ్ చేస్తే ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే కూరగాయలు కోయగానే వాటిని భద్రపర్చుకోవాలి.

ఫ్రిజ్‌ని శుభ్రం చేయకపోవడం : ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. రిఫ్రిజిరేటర్​ను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం. ప్రస్తుత రోజుల్లో టైమ్ లేదనో, ఇంకేదో కారణం చేతనో నెలల తరబడి దాన్ని క్లీన్ చేయరు. ఫలితంగా అందులో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మీరు స్టోర్ చేసే పదార్థాలపైకి చేరి కలుషితం చేస్తుంది. కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా దానిని శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అదేవిధంగా చాలా మంది ఫ్రిజ్​ను సరైన ప్లేస్​లో ఉంచరు. అది కూడా కిచెన్​లో ఇబ్బందిగా మారుతుంది.

కిచెన్​లో ఈగలు, కీటకాల సమస్య ఎక్కువగా ఉందా? - ఈ టిప్స్​తో ఒక్కటి కూడా కనిపించదు!

ఎగువ షెల్ఫ్‌లో మాంసం : చాలా మంది ఏదైనా నాన్​వెజ్ వండినప్పుడు మిగిలితే దాన్ని ఫ్రిజ్ టాప్ షెల్ఫ్​లో స్టోర్ చేస్తుంటారు. కానీ, అది తప్పు. అలా చేయడం ద్వారా సడన్​గా ఫ్రిజ్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా తాకితే అవి మిగతా వాటిపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పుడైనా దిగువ షెల్ఫ్​లో నిల్వ చేయాలి.

పండ్లు సరిగ్గా స్టోర్ చేయకపోవడం : మార్కెట్​ నుంచి పండ్లు తేగానే శుభ్రంగా కడిగి ఫ్రిజ్​లో స్టోర్ చేసుకోవాలి. కానీ, కొందరు వాటిని అలాగే కిచెన్​లో పడేస్తారు. అలా చేయడం ద్వారా అవి త్వరగా చెడిపోవడమే కాకుండా.. బ్యాక్టీరియాకు ఆవాసంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సరిగ్గా స్టోర్ చేసుకోవడం ముఖ్యం.

డిష్‌వాషర్‌ శుభ్రం చేయకపోవడం : చాలా మంది పాత్రలను స్టోర్ చేయడానికి డిష్‌వాషర్లు యూజ్ చేస్తున్నారు. అయితే వాటి శుభ్రత విషయంలో కాస్త అశ్రద్ధగా ఉంటారు. దీంతో వాటిల్లో కొన్నిసార్లు ఆహార అవశేషాలు పేరుకుపోయి బ్యాక్టీరియా, వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

పాత్రలను కడిగాక వేలాడదీయకపోవడం : వంటగదిలో చాలా మంది చేసే మరో మిస్టేక్ ఏంటంటే.. పాత్రలను కడిగాక స్టాండ్స్​లో వేలాడదీయరు. అలాగే కిచెన్ ప్లాట్‌ఫామ్‌ మీద పెడతారు. దాంతో ఆ వాటర్ ఫ్లోర్ మీద పడి తేమగా మారుతుంది. అప్పుడు తడికి బ్యాక్టీరియా, వైరస్ త్వరగా పెరుగుతాయి. అవి ఆహార పదార్థాల్లోకి చేరతాయి.

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

Kitchen: వంటిల్లు ఓ వైద్యాలయం... పోపులపెట్టె.. మెడికల్ కిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.