Avinash Reddy PA Raghava Reddy in Pulivendula: వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి నెలరోజుల తర్వాత పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 8వ తేదీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవరెడ్డి ఇవాళ పులివెందులలోని ఆయన ఇంటికి వచ్చారు. ఈనెల 12వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాల మేరకు రాఘవరెడ్డి పులివెందులలో కనిపించాడు.
రాఘవరెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు: రాఘవరెడ్డి ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న పులివెందుల పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి వర్రా కేసులో విచారణకు రావాలని కోరారు. నోటీసులు ఇస్తేనే విచారణకు వస్తానని రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయం ఆయన తరఫు న్యాయవాది ఓబుల్ రెడ్డి కూడా పులివెందుల పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. నోటీసిస్తే విచారణకు వస్తామని స్పష్టం చేయడంతో పోలీసులు వెనుతిరిగి వెళ్లారు.
రాఘవరెడ్డికి 41-ఏ నోటీసులు: అనంతరం ఆదివారం రాత్రి అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డికి 41-ఏ నోటీసులు జారీ చేశారు. నెల రోజుల తర్వాత పులివెందులకు వచ్చిన రాఘవరెడ్డికి డీఎస్పీ మురళి నాయక్ 41A నోటిసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్తే, నోటీసులు ఇస్తేనే విచారణకు వస్తానని రాఘవరెడ్డి స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆదివారం రాత్రి 41A నోటీసులు అందజేశారు. దీంతో సోమవారం రాఘవరెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
నెల తర్వాత పులివెందులకు వచ్చిన అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి: వర్రా రవీందర్‌రెడ్డి (Varra Ravinder Reddy) పోస్టుల కేసులో 20వ నిందితుడిగా ఉన్న రాఘవరెడ్డి కీలకమైన అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇతని కోసం నెల రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నా దొరకకపోవడంతో, ఇవాళ పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. కాగా ఇదే కేసులో రాఘవరెడ్డి అనుచరుడు పవన్ కుమార్‌ను డీఎస్పీ మురళి నాయక్ విచారించారు.
అవినాష్‌రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత - 16 రోజులుగా పరారీలోనే