ETV Bharat / state

YUVA : ఆనందాలు, ఆవిష్కరణలకు కేరాఫ్ 'అట్మాస్-2024' - వచ్చేసిందోచ్​ - BITS PILANI ATMOS 2024

హైదరాబాద్ బిట్స్‌ పిలానీ వేదికగా అట్మాస్‌-2024 - రోబో వార్స్‌, డ్రోన్ రేసింగ్‌, హ్యాకథాన్‌, టెక్‌ ఎక్స్‌పో, క్విజ్‌ కాంటెస్ట్‌లు నిర్వహణ

Atmos -2024 Program at BITS Pilani
Atmos -2024 Program at BITS Pilani (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 7:36 AM IST

ATMOS -2024 Program at BITS Pilani : ఉర్రూతలూగించే BITS పిలానీ ATMOS ఈ ఏడాది కూడా సందడి చేయనుంది. యూత్‌ను ఆకట్టుకునేందుకు మరింత జోష్‌తో 2024 ఎడిషన్‌ ముస్తాబైంది. రోబో వార్స్‌, డ్రోన్ రేసింగ్‌, హ్యాకథాన్‌ లాంటి మెదడుకు పదును పెట్టే ఈవెంట్స్‌తో పాటు టెక్‌ ఎక్స్‌పో, ఇన్నోవేషన్స్‌, రేసింగ్‌, క్విజ్‌ లాంటి అద్భుత కాంటెస్ట్‌లు యువతను అలరించనున్నాయి. 3రోజుల పాటు జరిగే టెక్నికల్‌ ఈవెంట్‌ ఇవాళ్టి (నవంబర్‌ 8) నుంచి ప్రారంభం కానుంది. మరి, ATMOS ఎలా ఉండనుంది? ఉరిమే ఉత్సాహంతో పాటు ఈ ఈవెంట్ ప్రత్యేకతలు ఏమిటి? ఈ స్టోరీలో చూద్దాం.

దేశంలో జరిగే ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లలో ఒకటిగా పేరు : కాలేజీ అంటే ఎప్పుడూ నోట్‌బుక్సేనా, అలా ఉంటే ఎవరికైనా బోర్‌ కొట్టేస్తుంది. పుస్తకాలతో పాటు కాస్త రియాల్టీకి దగ్గరగా ఉండే ఈవెంట్స్‌ ఉంటేనే.. విద్యార్థుల్లో అసలైన స్కిల్స్‌ బయట పడతాయి. కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ తోడైతే ఇక బీభత్సమే. అలాంటి ప్రతిభను వెలికితీయడానికే ఏటా BITS పిలానీ ఆధ్వర్యంలో ATMOS టెక్నికల్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా నవంబర్‌ 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌ BITS పిలానీ యూనివర్సిటీలో ఈవెంట్ జరగనుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ టెక్నికల్‌ ఈవెంట్‌లో విభిన్నమైన నైపుణ్యాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. 2012లో ప్రారంభమైన ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. పూర్తిగా విద్యార్థులు నిర్వహించే టెక్నికల్ ఈవెంట్ ఇది.

ఈ ఏడాది సందర్శకులను ఆకట్టుకోనున్న వాటిల్లో రోబో వార్స్‌ ట్రెండింగ్‌లో ఉండనుంది. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 20కిపైగా రోబోలు ఈ పోటీలో అలరించనున్నాయి. దీంతో పాటు డ్రోన్‌ రేసింగ్. ప్రొఫెషనల్‌ ఎఫ్‌.పీ.వీ డ్రైవర్స్‌ ఈ పోటీల్లో పాల్గొననున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఫస్ట్‌ ఎడిషన్‌కు వచ్చిన స్పందనతో ఏటా డ్రోన్‌ రేసింగ్‌ కొనసాగిస్తూనే ఉన్నారు. మరో ఇంట్రెస్టింగ్‌ పోటీ.. ఏటీవీ రేసింగ్‌. ఆటో ఎక్స్‌పో అండ్‌ టైం అటాక్‌ రేస్‌లో భాగంగా విద్యార్థులే స్వయంగా తయారు చేసిన వాహనాలతో రేసింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 ఏ.టీ.వీ టీంలు పోటీలో పాల్గొననున్నాయి. హ్యాకథాన్‌ విద్యార్థుల నైపుణ్యాలను బయటపెట్టనున్నాయి. ఇదొక ప్రీమియర్‌ కోడింగ్ కాంటెస్టు.

ఏఐ, రోబోటిక్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి వినూత్న ప్రాజెక్టుల సందడి : ఏటాలానే ఈ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన వేల మంది విద్యార్థులు ఈ కోడింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులు తయారు చేసిన 100కుపైగా ప్రాజెక్టులతో ఏర్పాటు కానున్న టెక్‌ ఎక్స్‌పో మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇందులో ఏఐ, రోబోటిక్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి వినూత్న ప్రాజెక్టులు సందడి చేయనున్నాయి. ఇదే కాక 5,000 మందికిపైగా విద్యార్థులు, తమ వినూత్న ఆవిష్కరణలను ATMOS-2024 ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. పోటీలను బట్టి అన్నింటికి ప్రైజ్‌ మనీ కూడా నిర్వహకులు అందిస్తున్నారు. కొన్ని నమూనాలను పరిశ్రమలకు కూడా పంపనున్నారు.

ATMOS ఈవెంట్‌లో టెక్నికల్‌ కాంటెస్టులతో పాటు మ్యూజిక్‌ వర్క్‌షాప్‌, క్రైం సీన్‌ ఇన్విస్టిగేషన్‌, ట్రేడింగ్‌ కాపింటిషన్‌, గేమ్‌ రూమ్‌, పేపర్‌ ప్రజెంటేషన్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవేకాక ప్రముఖులతో ముఖాముఖి, మ్యూజిక్‌ కాన్సర్ట్‌ లాంటివి ATMOS ఈవెంట్‌లో మరింత జోష్‌ తీసుకురానున్నాయి. మెుత్తంగా 3రోజులు అలరించే టెక్నికల్‌ ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది. BITS పిలానీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు మీడియా పార్టనర్‌గా ఈటీవీ తెలంగాణ అలాగే డిజిటల్‌ పార్టనర్‌గా ఈటీవీ భారత్‌ వ్యవహరిస్తున్నాయి. మెుత్తంగా 3రోజుల పాటు విద్యార్థులు, ఈవెంట్‌కు వచ్చే సందర్శకులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విజ్ఞానంతో పాటు వివిధ రకాల వినోదాలను కూడా ATMOS 2024 పంచనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.