ATMOS 2024 Celebratration on Hyderabad BITS Pilani Campus : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన టెక్ ఈవెంట్ అట్మోస్ హైదరాబాద్ బిట్స్ పిలానీలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్‌లో విద్యార్థులు భిన్నమైన నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. పూర్తిగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో డ్రోన్ రేసింగ్, రోబో వార్స్ లాంటి వాటితో పాటు ఏటీవీ రేసింగ్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవనుంది. 2012లో ప్రారంభమైన ఈ వేడుకలకు ఈ సారి హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ యూనివర్సిటీ వేదిక కానుంది.
ప్రస్తుతం జరగనున్న 12వ ఎడిషన్ అట్టహాసంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్‌కుమార్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణతో పాటు కళాశాల, వివిధ విభాగాల ప్రొఫెసర్‌లు, డైరెక్టర్లు హజరు అయ్యారు. ఈ టెక్నికల్ ఈవెంట్‌కు దేశంలో నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రంలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు హజరు అయ్యి తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. మొదటి రోజు జరిగిన ఈ వేడుకల్లో టెక్నికల్ ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. మరో రెండు రోజులు పాటు డ్రోన్ రేసింగ్, ఏటీవీ రేసింగ్, రోబో వార్ లాంటి పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వహకులు తెలియజేశారు.
సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించిన సీఎం- దేశీయ పర్యాటకంలోనే ఇదో మైలురాయన్న చంద్రబాబు
అట్మోస్ ఈవెంట్‌లో నటుడు విశ్వక్సేన్ : ప్రముఖ నటుడు విశ్వక్సేన్ ఈ రోజు జరిగే వేడుకల్లో పాల్గొననున్నాడు. ఉర్రూతలూగించే మ్యూజిక్ ఈవెంట్‌కు ప్రముఖ గాయకుడు నకాశ్ అజీజ్ రానున్నాడు. వినోదం, విజ్ఞానం కలగలసిన వేడుకగా అట్మోస్ 2024 నిలవనుంది. అట్మోస్ ఈవెంట్‌లో టెక్నికల్ కాంటెస్టులతో పాటు పేపర్ ప్రజెంటేషన్, గేమ్ రూమ్, ట్రేడింగ్ కాపింటిషన్, క్రైం ఇన్విస్టిగేషన్, మ్యూజిక్ వర్క్‌షాప్ లాంటివి కూడా ఉన్నాయి.
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం : రామ్మోహన్ నాయుడు
ఇవేకాక ప్రముఖులతో ముఖాముఖి, మ్యూజిక్ కాన్సర్ట్ లాంటివి అట్మోస్ ఈవెంట్‌లో మరింత జోష్‌ని అందిస్తున్నాయి. బిట్స్ పిలానీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్‌కు మీడియా పార్టనర్‌గా ఈటీవీ తెలంగాణ, అలాగే డిజిటల్ పార్టనర్‌గా ఈటీవీ భారత్ భాగస్వామ్యంగా ఉంది. విద్యార్థులు, ఈవెంట్‌కు వచ్చే సందర్శకులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విజ్ఞానంతో పాటు వివిధ రకాల వినోదాలను కూడా అట్మోస్ 2024 పంచనుంది.