ATMOS -2024 Program at BITS Pilani : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన టెక్ ఈవెంట్ అట్మోస్ బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈవెంట్‌లో భిన్నమైన నైపుణ్యాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పూర్తిగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరగుతున్న ఈ వేడుకల్లో డ్రోన్ రేసింగ్, రోబో వార్స్ లాంటి వాటితో పాటు ఏటీవీ రేసింగ్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. ప్రతిష్టాత్మక టెక్ ఈవెంట్‌కు వేదికైంది హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ యూనివర్సిటీ. 2012లో ప్రారంభమైన ఈ వేడుకులు ఏటా జరుగుతున్నాయి.
ప్రస్తుతం 12వ ఎడిషన్ అట్టహాసంగా సాగుతోంది. ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్‌కుమార్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణతో పాటు కళాశాల డైరెక్టర్, వివిధ విభాగాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ టెక్నికల్ ఈవెంట్‌లో దేశంతో పాటు, రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు పాఠశాలల విద్యార్థులు కూడా ఇక్కడ తమ నైపుణ్యాలు ప్రదర్శించారు. మొదటి రోజు వేడుకల్లో టెక్నికల్ ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. మరో రెండ్రోజులు డ్రోన్ రేసింగ్, ఏటీవీ రేసింగ్, రోబో వార్ లాంటి పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వహకులు చెబుతున్నారు.
ATMOS ఈవెంట్‌లో నటుడు విశ్వక్‌సేన్ : ప్రముఖ నటుడు విశ్వక్‌సేన్ ఈరోజు జరిగే వేడుకల్లో పాల్గొననున్నాడు. ఉర్రూతలూగించే మ్యూజిక్ ఈవెంట్‌కు ప్రముఖ గాయకుడు నకాశ్ అజీజ్ రానున్నాడు. వినోదం, విజ్ఞానం కలగలసిన వేడుకగా అట్మోస్ 2024 నిలవనుంది. ATMOS ఈవెంట్‌లో టెక్నికల్ కాంటెస్టులతో పాటు మ్యూజిక్ వర్క్‌షాప్, క్రైం సీన్ ఇన్విస్టిగేషన్, ట్రేడింగ్ కాపింటిషన్, గేమ్ రూమ్, పేపర్ ప్రజెంటేషన్ లాంటివి కూడా ఉన్నాయి.
ఇవేకాక ప్రముఖులతో ముఖాముఖి, మ్యూజిక్ కాన్సర్ట్ లాంటివి ATMOS ఈవెంట్‌లో మరింత జోష్ తీసుకురానున్నాయి. BITS పిలానీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు మీడియా పార్టనర్‌గా ఈటీవీ తెలంగాణ, అలాగే డిజిటల్ పార్టనర్‌గా ఈటీవీ భారత్ వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులు, ఈవెంట్‌కు వచ్చే సందర్శకులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విజ్ఞానంతో పాటు వివిధ రకాల వినోదాలను కూడా ATMOS 2024 పంచనుంది.
హైదరాబాద్‌లోనే ఉంటున్నారా?- నేటి నుంచి టెక్నాలజీ మేళా- సెలబ్రిటీలు కూడా వస్తున్నారంట!
YUVA : ఆనందాలు, ఆవిష్కరణలకు కేరాఫ్ 'అట్మాస్-2024' - వచ్చేసిందోచ్