ETV Bharat / state

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈ నెల 9న ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారికి ఈ నెల 9న శనివారం పుష్పయాగ మహోత్సవం - ఆర్జిత సేవల రద్దు చేసిన టీటీడీ

Pushpayaga Mahotsavam
Pushpayaga Mahotsavam In Thirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Tirumala Arjitha Sevas Cancelled on November 9th : తిరుమల భక్తులకు అలర్ట్. ఈనెల 9వ తేదీన కల్యాణోత్సవం, ఉంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. 9న శ్రీవారికి ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పలు సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంకురార్పణ నేపథ్యంలో ముందురోజు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

శ్రీవారి పుష్పయాగం : ఈనెల 9వ తేదీన పవిత్రమైన కార్తిక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలు సమర్పించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహిస్తారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - వారం రోజుల పాటు స్వామి వారి వస్త్రాల ఈ వేలం - లాస్ట్​ డేట్​ అప్పుడే!

Pushpayaga Mahotsavam In Tirumala : ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో పూజారులు అభిషేకం చేస్తారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ చేసి, ఆలయ మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని టీటీడీ అధికారులు తెలిపారు.

టీటీడీ ఛైర్మన్​గా బీఆర్ నాయుడు ప్రమాణం : మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం భూవరాహ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బీఆర్ నాయుడికి ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికారు.

తర్వాత ఆలయంలోని గరుడాళ్వర్ సన్నిధి వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడితో ప్రమాణం చేయించారు. టీటీడీ 54వ ఛైర్మన్​గా బీఆర్​ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు.

'శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలన్నదే నా ఆలోచన - భక్తులకు గంటలోనే దర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.