ETV Bharat / state

ఇసుక రవాణా వివాదాలు - గ్రామాల మధ్య కొట్లాటలు, గొడవలు

రాష్రంలో ఇసుక రవాణా విషయంలో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇసుక రవాణా విషయంలో స్థానికులకు, ఇతర గ్రామస్థుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

arguments_on_sand_transportation
arguments_on_sand_transportation (ETV Bharat)

Argument Between Two Groups Over Transportation of Sand : కృష్ణా నదిలో ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా 2 గ్రామాలకు మధ్య చిచ్చు పెట్టింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో పెసర్లంకలో చోటుచేసుకుంది. ఈ విషయమై స్థానికులకు, ఇతర గ్రామస్థులకు వాగ్వాదం జరిగింది. పెసర్లంక సమీపంలోని కృష్ణా నది నుంచి రెండు రోజులుగా చుట్టుపక్కల గ్రామాల వారు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తీసుకెళ్లాలంటే 500 రూపాయలు శివాలయం మరమ్మతులకు చెల్లించాలని గ్రామానికి చెందిన కొందరు షరతులు విధించారు. దీంతో ఓ ట్రాక్టర్ యజమాని తన వాహనాన్ని కొల్లూరు లాకుల కూడలిలో రహదారిపై అడ్డుగా పెట్టి నిరసన తెలిపాడు.

ఇసుక రవాణా వివాదాలు - గ్రామాల మధ్య కొట్లాటలు, గొడవలు (ETV Bharat)

అతనికి మద్దతుగా మరికొందరు ట్రాక్టర్లను రహదారిపై నిలపడంతో 2 గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పాఠశాల నుంచి విద్యార్థులను ఇళ్లకు చేరవేసే బస్సులు, ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలు రోడ్డుపై పదుల సంఖ్యలో నిలిచి పోయాయి. రెండు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గా లను చెదరగొట్టి, రహదారికి అడ్డుగా నిలిపిన వాహనాన్ని తొలగించారు. పెసర్లంకకు చెందిన సాతా శివప్రసాద్​ను అదుపులోకి తీసుకుని బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడు గ్రామంలో ఇసుక కేంద్రంగా రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఇసుక ఉచితం కావడంతో గృహనిర్మాణం కోసం వాగులో ఇసుక కోసం వెళ్లిన వారిపై ఇసుక మాఫియా దౌర్జన్యం చేసింది. దీంతో ఇరు వర్గాల వారు ఇటుక రాళ్లతో దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలు అవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము తప్ప వేరొకరు వాగులో ఇసుక తోలడానికి వీల్లేదని ఇసుక నిర్వాహకులు తమపై దాడికి దిగారని భాదితులు వాపోయారు. అక్రమంగా ఇసుకను బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

'ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకుపోవచ్చు - సీనరేజ్ వసూళ్లు ఎత్తివేత' - ఇసుక పాలసీలో కీలక మార్పులు ఇవే

ఆ 15 మంది MLAలకు చంద్రబాబు వార్నింగ్! - ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో జోక్యం

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.