ETV Bharat / state

కొత్త జంటలకు షాక్ - ఇకపై ఆ రాములోరి ఆలయంలో పెళ్లిళ్లు బంద్

ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో ఇక నుంచి పెళ్లిళ్లు బంద్ - ఆంధ్రుల భద్రాద్రిలో వివాహాలు చేయవద్దంటూ పురావస్తు శాఖ ఆదేశాలు - విస్మయానికి గురవుతున్న భక్తులు

Vontimitta Rama Temple
Vontimitta Rama Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 8:31 AM IST

Vontimitta Rama Temple : ఇక ఆ రాములోరి ఆలయంలో వివాహాలు జరగవు. అదేంటి? శ్రీ సీతారాముల ఆలయంలో వివాహాలు జరగకపోవడం ఏంటని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్కడి రామాలయంలో పెళ్లిలు జరగనీయకుండా ఆపేశారో తెలుసా? అదే పక్క రాష్ట్రం ఏపీలోని ఆంధ్రుల భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట కోదండ రాముడి సన్నిధిలో. అదేంటి అలా అని భక్తులు నోరెళ్లబెడుతున్నారు. అసలేం జరిగిందని ప్రశ్నిస్తున్నారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని భారత పురాతత్త్వ-సర్వేక్షణ శాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు శుక్రవారం టీటీడీ పరిపాలన యంత్రాంగానికి సెల్​ఫోన్​లో ఆదేశాలు పంపారు. దీంతో గత పదేళ్లుగా వస్తున్న విధానాన్ని ఒక్కసారిగా ఎలా నిలిపి వేస్తారని భక్తులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.

అసలు ఒంటిమిట్టలో వివాహాలు ఎలా జరిగేవి :

  • ముందుగా ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రుల ఆధార్​ పత్రాలు, శుభలేఖ అందించే వారు.
  • వివాహం చేయడానికి రుసుం రూ.500 చెల్లించేవారు.
  • ఆలయంలో పని చేస్తున్న భజంత్రీల సిబ్బంది, అర్చకుల ద్వారా వివాహ క్రతువు నిర్వహించేవారు. వీరికి కొంత నగదు ఇచ్చి ఉపాధి దొరికేది.
  • అలాగే ఆలయంలో వేదిక, షామియనాలు, విద్యుద్దీకరణ, పందిళ్లు, అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, బల్లలు ఇలాంటి ఏవీ ఆలయంలో వేయరు.
  • ఉదయం టిఫిన్​, తేనీరు, భోజనం వసతి కూడా ఉండదు.
  • ఇక్కడి కొలువైన రామలింగేశ్వరస్వామి ముంగిట్లో, సీతారాముల ఎదుర్కోలు మండపాల దగ్గరి చలువరాళ్లపై సాధారణంగా వివాహాలు చేసుకునే వారు.

గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయం : ఇదే సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటివరకు ఎవరూ ఈ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట ఆలయం వేళలు ఉదయం 5 నుంచి సాయంత్రం 8.45 గంటల వరకు ఉండగా, ఈ వేళల్లో ఎప్పుడైనా లగ్నం చేసుకుని వివాహం చేసుకునేవారు. ఇక్కడ ఒక పెళ్లి క్రతువు జరగడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. ఎవరి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. తాజాగా పురావస్తు శాఖ అధికారులు వివాహాలు చేసుకోవద్దని టీటీడీ పాలనాధికారులకు సెల్​ఫోన్​లో మౌఖిక ఆదేశం ఇచ్చారు. అనుమతి ఇవ్వరాదని అన్నారు.

కార్తిక మాసం కావడంతో ఎక్కువ ముహూర్తాలు : కార్తిక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక్కడి వెలసిన జగదభిరాముడి సన్నిధిలో వివాహం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. ముందస్తుగా వివాహ కట్టడి రుసుం చెల్లించాలని వస్తున్న వారికి తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం లేదు అధికారులు. ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారతీయ సనాతన సంప్రదాయం అనుసరించి రామాలయంలో పెళ్లిలు చేసుకుకోకుండా ఆంక్షలు విధించడం విచిత్రంగా ఉందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన ఓ అధికారిని అడిగితే వాస్తవమేనని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

రూ.625 కోట్ల 'పెళ్లిళ్ల సీజన్'! - ఒక్కటి కానున్న 5 వేల జంటలు - ఇంట్లో పెళ్లి బాజా, మండపంలో ఖర్చుల మోత

2నెలల్లో 48లక్షల పెళ్లిళ్లు- రూ.6లక్షల కోట్ల బిజినెస్- భారత్​లో అలా ఉంటది మరి! - Indian Wedding Season Business 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.