APSRTC Passengers Faced Bus Problems: గంటల తరబడి బస్సు కోసం ఎదురుచూపులు. చిన్నపిల్లల రోదనలు, వృద్ధుల ఇబ్బందులు, మహిళల తీవ్ర ఇక్కట్లు. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా. ఏలూరు జిల్లాలోని కొత్త బస్టాండ్లో అవిష్కృతమైన ఘటనలివీ. గంటల తరబడి బస్టాండ్లో ఎదురుచూసినా ఒక్క బస్సైనా రావడం లేదని ఆర్టీసీ ప్రయాణికులు ఆవేదనకు లోనయ్యారు. గంటలు గంటలు వేచి చూస్తే వచ్చిన ఒక్క బస్సును పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికులు ఎన్నో తంటాలు పడుతూ ఎక్కాల్సి వచ్చిందంటూ అసహనానికి లోనయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారంటే తమకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆర్టీసీ ప్రయాణికులు వాపోతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు, ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ వాహనాలను వందల సంఖ్యలో వినియోగించడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. దీని వల్ల వాహనాలు కొరత ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోంటున్నారు. ఇదే తరహలో ఏలూరు జిల్లాలో ప్రయాణికులు నానా అవస్థలను చవి చూశారు.
గుంతల రోడ్లు - కాలం చెల్లిన బస్సులు - ఆర్టీసీ సిబ్బందికి ఇక్కట్లు
వందల సంఖ్యలో వాహనాల తరలింపు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆ బహిరంగ సభకు ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి భారీ సంఖ్యలో వాహనాలు వినియోగించారు. ఇందులో ఆర్టీసీ బస్సులది ప్రధాన పాత్ర కాగా, పలు ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలు, ఇతర వాహనాలు విరివిగా ఉపయోగించారు.
అధికారులు ప్రయాణికుల సమస్యనూ దృష్టిలో ఉంచుకోవాలి: ఆర్టీసీ బస్సులను సిద్ధం సభకు తరలించడంతో ఏలూరు జిల్లాలోని కొత్త బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులు, బస్సులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నారు. గంటకో బస్సు రావడంతో ప్రయాణికులు రద్దీ అధికమయ్యింది. ఈ నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు అవస్థ పడుతూ బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
సీఎం సభకు ఆర్టీసీ బస్సులు- సాధారణ ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
సభకు తరలించిన బస్సుల వివరాలు: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం డిపో నుంచి 35 బస్సులు, రామచంద్రపురం డిపో నుంచి 25 బస్సులు, అమలాపురం డిపో నుంచి 49 బస్సులు, రాజోలు డిపో నుంచి 18 బస్సులు మొత్తం జిల్లా నుంచి 130 బస్సులను సిద్ధం సభకు తరలించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు ఉండడంతో, ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణాలు చేయాల్సి వచ్చింది.
సీఎం జగన్ కడపకు - కడప జనం నగర శివారుకు 'ఇదేంది జగనన్నా?