ETV Bharat / state

అప్లై చేసింది ఓ జిల్లా - హాల్​ టికెట్​లో మరో జిల్లా - ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు - TG DSC Exam Hall Ticket Issue - TG DSC EXAM HALL TICKET ISSUE

TG DSC Exam Hall Ticket Issue : ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష కోసం జారీ చేసిన హాల్​ టికెట్ల జారీలో గందరగోళం నెలకొంది. ఒక జిల్లాలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి, మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌ టికెట్‌లో వచ్చింది. ఏం చేయాలో పాలుపోక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులను సంప్రదిస్తే, సరైన స్పందన కనిపించడం లేదని వాపోతున్నారు.

TG DSC Exam Hall Ticket Issue
TG DSC Exam Hall Ticket Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 12:31 PM IST

Telangana DSC Exam Hall Ticket Issue : ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి హాల్​ టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. గత కొంతకాలంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. తాజాగా హాల్​టికెట్ల విషయంలో విద్యాశాఖ తీరుపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తాము ఒక జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే, మరో జిల్లాలోని పోస్టుకు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లుగా చూపించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష కోసం జారీ చేసిన హాల్​టికెట్ల గందరగోళంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఒక జిల్లాలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి, మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌ టికెట్‌లో రావడంతో అభ్యర్థులు కంగుతింటున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రీపెల్లి జ్యోత్స్న మంచిర్యాల జిల్లాలో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 19న డీఎస్సీ పరీక్ష ఉండగా, ఆమె నల్గొండ జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్‌ టికెట్‌ జారీ అయ్యింది. పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్‌ జిల్లా మావలలో కేటాయించారు.

డీఎస్సీ పరీక్ష విధానం, సిలబస్​ మార్చలేదు అందుకే వాయిదా కుదరదు : సీఎం రేవంత్ - CM Revanth comments on group 1

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కొర్కల్‌కు చెందిన పొరెడ్డి సౌజన్య డీఎస్సీలో అదే జిల్లాలో ఎస్‌ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. కరీంనగర్‌లో ఈ నెల 24న పరీక్ష ఉండగా, హాల్‌ టికెట్‌లో మాత్రం ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా ఉంది. ఈ విషయంపై హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు చేశామని, చాలా మందికి ఇలాగే తప్పుగా వచ్చాయని సౌజన్య తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి పొరపాటును సరిచేయాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం డీఎస్సీ పరీక్షా షెడ్యూల్​ను విడుదల చేసింది. జులై 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు, ఆగస్టు 5వ తేదీతో ముగుస్తాయి. అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్ www.schooledu.telangana.gov.in డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకేచోట రాయొచ్చు - డీఎస్సీ అభ్యర్థులకు సూపర్ గుడ్​న్యూస్ - TS DSC Exam Rules

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.