APCC Chief YS Sharmila Comments on Avinash and Bharathi: ఓటమి భయంతోనే ఎంపీ అవినాష్‌రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎంపీగా అవినాష్‌రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లేనన్న ఆమె వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహమని మండిపడ్డారు. ఈ క్రమంలో గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండని, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అని వైఎస్ భారతిపై నిప్పులు చెరిగారు. ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్‌రెడ్డికి ఓటెయ్యండన్న ఆమె అవినాష్‌రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటేయమని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
"ఓటమి భయంతో అవినాష్‌రెడ్డి ఊరుదాటేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్‌రెడ్డి ఉన్నారు. ఎంపీగా అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లే. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహం. వాళ్లే అధికారంలో ఉండాలి. గొడ్డలితో అందర్నీ నరకాలనేది భారతి వ్యూహం. గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటెయ్యండి. మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్‌రెడ్డికి ఓటెయ్యండి. దేవుడు మావైపే ఉంటాడు గొడ్డలితో నరికే వాళ్ల వైపు కాదు." - వైఎస్ షర్మిల, ఏపీసీపీ అధ్యక్షురాలు
ఏపీ ప్రజల మన్‌కీ బాత్‌ను ప్రధాని మోదీ వినాలి: ఇదిలా ఉండగా ప్రధాని మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్‌గా పంపించి రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్న ఆమె రాష్ట్ర ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.