APCC Cheif Sharmila: అనకాపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ నిర్వహించగా, ఆ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ఏమాయ్యాయని ఆమె నిలదీశారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాయని ఆమె ఆరోపించారు.
రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు : రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకపక్షం, ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీతో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. బీజేపీతో వైఎస్సార్సీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఆమె దుయ్యబట్టారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను వైఎస్సార్సీపీ తాకట్టు పెట్టిందన్నారు. బీజేపీకి తొత్తులుగా మారిన పార్టీలను తుంగలో తొక్కి, రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు.
బీజేపీ చేతుల్లో వైసీపీ - ప్రత్యేక హోదా మర్చిపోయిన జగన్: షర్మిల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును నిర్వీర్యం చేశాయి : గత ప్రభుత్వాలు రాష్ట్రాంలోని ప్యాక్టరీలన్నీంటిని నష్టాల్లో ఉంటే కాపాడాయని, విశాఖ ఉక్కు కార్మాగారంలోని కార్మికులకు ప్రస్తుత ప్రభుత్వంపై భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విశాఖ ఉక్కు ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటా అప్పనంగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆమె ఆక్షేపించారు.
బీజేపీ ప్రభుత్వం ప్రశాంతంగా ఒక యాత్ర కూడా చేయనివ్వదా !: షర్మిల
ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాటలేమయ్యాయి : ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గట్టిగా మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాపై పోరాడటం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖకు ఏం చేసిందని ఆమె నిలదీశారు. కనీసం రైల్వే జోన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని, అప్పుడు బీజేపీ ఎలా ప్రత్యేక హోదా ఇవ్వదో చూద్దామని జగన్ అన్నారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్రంలోని మంత్రి స్థానాలు తనకిస్తే కేంద్రం మెడలు వంచుతానన్నారని, ఒక్కసారైనా బీజేపీ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారా అని నిలదీశారు.
వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది - ఆ పార్టీల ఉచ్చులో పడొద్దు: షర్మిల
కాంగ్రెస్ అధికారానికి సైనికుల్లా పనిచేయాలి : రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీకి బానిసలు కావడమే కాకుండా, రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా మార్చాలని చూస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని కోరారు. ఎన్నికల కోసం తాను ఎంతటి కార్యానికైనా సిద్ధమని వివరించారు. ప్రజావ్యతిరేక పార్టీలు అధికారం నుంచి పోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
"రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యాయి. బీజేపీతో వైఎస్సార్సీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గట్టిగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాడటం లేదు." - వైఎస్ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిల వాహన కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు - రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు