ETV Bharat / state

తక్కువ ధరకు కోట్ చేసిన వారికే నెయ్యి కాంట్రాక్టు - నివేదికలో కచ్చితత్వం లేదు : జగన్ - ys Jagan Tirumala visit Cancelled - YS JAGAN TIRUMALA VISIT CANCELLED

Jagan Tirupati Tour Cancelled : ఏపీ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తిరుమల పర్యటన రద్దు అయింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్‌ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Jagan Tirumala visit Cancelled
AP YCP President Jagan Tirumala visit Cancelled (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 3:29 PM IST

Updated : Sep 27, 2024, 6:54 PM IST

AP YCP President Jagan visit To Tirumala : ఏపీ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తిరుమల పర్యటన రద్దు అయింది. మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరాల్సి ఉన్న జగన్ తిరుపతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేయించుకున్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్‌ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు : అనంతరం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో జగన్​ మాట్లాడుతూ దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణం అని అనుమతి లేదంటూ పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడం లాంటి పరిస్థితి గతంలో తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలపై చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయన్న జగన్ లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్‌ వివాదం తెచ్చారని విమర్శించారు. తిరుమల పవిత్రత, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారని మండిపడ్డారు.

కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్లుగా దుష్ప్రచారం : జంతువుల కొవ్వుతో ప్రసాదాలు తయారు చేశారని అబద్ధాలు చెబుతున్నారన్న జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తామన్నారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదేనని, తక్కువ రేటుకు కోట్ చేసిన వారికి టీటీడీ టెండర్ ఖరారు చేస్తుందన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు ప్రముఖులు పారదర్శకంగా పనిచేస్తారని, టీటీడీ సభ్యులుగా తీసుకోవాలని కేంద్రం, సీఎంలు సిఫారసు చేస్తారని మరోసారి వ్యాఖ్యానించారు.

క్వాలిటీ పరీక్షలు పూర్తయ్యాకే వాహనాలు వస్తాయని, టీటీడీ కూడా మళ్లీ క్వాలిటీ చెక్ చేస్తోందని జగన్ తెలిపారు. తప్పు చేసేందుకు అవకాశం లేని వ్యవస్థ టీటీడీలో ఉందని, గతంలో టీడీపీ హయాంలో వాహనాలు వెనక్కి పంపారని, తమ హయాంలోనూ 18 సార్లు వాహనాలను వెనక్కి పంపారని గుర్తు చేశారు. పరీక్షలో అప్పుడప్పుడు నమూనాలను సీఎఫ్‌టీఆర్‌ఐ మైసూర్‌కు పంపిస్తారన్న జగన్.. ఇప్పుడు నమూనాల పరీక్షకు మొదటిసారి గుజరాత్‌ పంపారని తెలిపారు.

శ్రీవారి ప్రసాదాల్లో వాడని నెయ్యిని వాడినట్లు ఎందుకు చెప్తున్నారని, జంతువుల కొవ్వు వాడారని స్వయంగా సీఎం అబద్ధాలు ఆడుతున్నారని జగన్‌ పేర్కొన్నారు. గుజరాత్‌ నుంచి వచ్చిన నివేదికను టీడీపీ కార్యాలయం రిలీజ్ చేసిందన్న జగన్.. రహస్య నివేదిక అయితే టీడీపీ ఆఫీసు నుంచి ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో పలుసార్లు చెప్పినా వినకుండా సీఎం మళ్లీ అబద్ధాలు చెప్పారని, రాజకీయంగా లబ్ధి పొందేందుకే అబద్ధాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు. తిరుమల ప్రసాదాలపై దుష్ప్రచారం చేయడం అపవిత్రత కాదా? అని ప్రశ్నించారు. ఆవులు వెజిటబుల్స్ ఆయిల్స్‌ తిన్నా ఇలాంటి ఫలితాలు వస్తాయని నివేదికలో ఉందని చెప్పారు.

రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి ప్రసాదాల విశిష్టతను దెబ్బతీస్తున్నారని, తిరుమల ప్రసాదాలపై అనుమానాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు డిక్లరేషన్ అంటున్నారన్న జగన్ తన కులం, మతం గురించి ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనం చేసుకున్నాకే నా పాదయాత్ర ప్రారంభించానని, పాదయాత్ర పూర్తయ్యాక కూడా నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని జగన్‌ అన్నారు.

గతంలో అనేకసార్లు తిరుమల వెళ్లాననే విషయం అందరికీ తెలుసు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఐదుసార్లు వస్త్రాలు సమర్పించా అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నానని, బయటకు వెళ్తే హిందూ సంప్రదాయాలు గౌరవిస్తా నా మతం మానవత్వం కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోండి అని వ్యాఖ్యానించారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అంటూ అడగడం సరికాదని, మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతావారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం.. కళ్ల ఎదుటే ఇలాంటివి జరుగుతుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? అని అన్నారు. హిందూమతానికి తామే టార్చ్ బేరర్స్ అని చెప్పుకొంటున్న బీజేపీ నేతలు స్వామివారి లడ్డూలపై దుష్ప్రచారం చేస్తున్నా పట్టించుకోరా? అని జగన్‌ ప్రశ్నించారు.

జగన్‌ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్‌ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour

ప్రకాశ్​రాజ్ అలా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan VS Prakash Raj

Last Updated : Sep 27, 2024, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.