AP Govt to Build Central Offices in Amravati : రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు 2014-19 మధ్య భూమి కేటాయించిన సంస్థలతో సీఆర్‌డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ప్రణాళికలు చెప్పాలంటూ సీఆర్‌డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. కాగా, ఐదేళ్లుగా తమను ఎవరూ సంప్రదించలేదని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించడం గమనార్హం.
ఈ క్రమంలోనే తమకు కేటాయించిన స్థలాలు చూపించాలని కొన్ని సంస్థలు కోరిన, రాజధానిలో స్థలాలు చూశాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. గత టీడీపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలకు, బ్యాంకులకు రాజధానిలో భూములను కేటాయించింది. అందులో కాగ్, ఆర్‌బీఐ, సీబీఐ, ఎఫ్‌సీఐ, సీపీడబ్ల్యూడీ, తపాలాశాఖ, నిఫ్ట్, ఎన్ఐడీ, టూల్ డిజైన్ సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటితో పాటు నాబార్డ్, ఎస్‌బీఐ, యూబీఐ, కెనరా బ్యాంక్, ఎల్ఐసీకి భూ కేటాయింపులు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమరావతిలో కార్యాలయం ఏర్పాటుకు ఐవోసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్ ఆసక్తి చూపుతున్నాయి.
ఏపీ అసెంబ్లీలో అసక్తిగా పవన్ కల్యాణ్ తొలి స్పీచ్ - ఏం మాట్లాడారో తెలుసా? - AP Deputy CM Pawan Kalyan