AP POLYCET Results Released : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం ఫలితాలను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 27న పాలిసెట్ నిర్వహించారు. మొత్తం 1.42లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 1.24లక్షల మంది అర్హత పొందారు. 87.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో బాలికలు 89.81శాతం(50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశ పరీక్షలో పొందిన మొత్తం మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.
AP Polycet 2024 Results : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు మొత్తం 267 ఉండగా, వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీలకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పదో తరగతి ఫలితాలు విడుదల - మళ్లీ బాలికలదే హవా - TELANGANA SSC RESULTS RELEASED 2024