ETV Bharat / state

రామ్​గోపాల్​ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు - CASE FILED ON DIRECTOR RGV

ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై ఆర్జీవీ ట్వీట్​లు - ఏపీలోని పలు స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదు

AP Police Files Case On RGV
Director Ram Gopal Varma Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 3:27 PM IST

Police Case Filed On Director RGV : సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్‌ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు సైతం చేస్తున్నారు. మరికొందరిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇంటూరి రవి కిరణ్‌, బోరుగడ్డ అనిల్​ కుమార్ ఇలా పలువురని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్​ పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌, ఆయన సతీమణి నారా బ్రాహ్మణిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని డైరెక్టర్​ రామ్‌గోపాల్ వర్మపై తాజాగా పలు పోలీస్ స్టేషన్​లలో కేసులు నమోదు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Ram Gopal Varma Tweet on Nara Chandrababu Naidu : సినీ డైరెక్టర్​ రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. వ్యూహం మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్​ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్​ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RGV Offensive Tweets on Pawan Kalyan : మరోవైపు రామ్‌గోపాల్ వర్మపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్​లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఇవాళ కంప్లైంట్ చేశారు. డైరెక్టర్​ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసుల ఆర్జీవీ కేసు నమోదు చేశారు.

ఆ అభ్యంతరకర పోస్టులను చూసి - నా కుమార్తెలు కన్నీరుపెట్టారు : పవన్​

మీరు సోషల్ మీడియా యాక్టివ్​ యూజర్​లా? - అలాంటి పోస్టులు పెడితే జైలుకే! తస్మాత్ జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.