ETV Bharat / state

మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్ - 3 రోజుల్లోనే వేల సంఖ్యలో దరఖాస్తులు! - AP Liquor Policy 2024

ఏపీలో నూతన మద్యం విధానంలో భాగంగా కొత్త దుకాణాలకు వేలం.. భారీగా వస్తున్న దరఖాస్తులు.

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

AP Liquor Policy 2024
AP Liquor Policy 2024 (ETV Bharat)

AP Liquor Policy 2024: ఆంధ్రప్రదేశ్​లో కొత్త మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన 3 రోజుల్లోనే ఏకంగా 3 వేల దరఖాస్తులకు పైగా వచ్చాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తొలిరోజైన మంగళవారం 200 రాగా, గత రెండు రోజుల్లో ఏకంగా 2,800కు పైగా అందాయి. ఫలితంగా ఇప్పటి వరకు రుసుముల రూపంలో సుమారు రూ.60 కోట్లు సమకూరాయి. అయితే, దరఖాస్తులు దాఖలు చేయడానికి ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉన్న నేపథ్యంలో.. చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశముంది.

చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్​లకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్‌ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు చేయడానికి ఈ నెల తొమ్మిది వరకు గడువు ఇచ్చింది. ఇంకా గడువు ఉన్న తరుణంలో మొత్తంగా లక్షకుపైగా దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు రుసుముల రూపంలోనే సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని భావిస్తున్నారు. గతంలో 2017లో 4,380 మద్యం దుకాణాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఒక్కో దానికి సగటున 18 చొప్పున మొత్తంగా 78 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 3,396 దుకాణాలకుగానూ ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి : నూతన మద్యం దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేకంగా వెబ్‌సైట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర యూజర్‌ మాన్యువల్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దరఖాస్తు విధానానికి సంబంధించిన ఉత్తర్వులు, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు.

  • ఇందుకోసం ముందుగా hpfsproject.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • ఫోన్‌ నంబర్‌నే యూజర్‌ ఐడీగా వినియోగించుకొని, పాస్‌వర్డ్‌ క్రియేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీతో లాగిన్‌ అయ్యి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విశాఖలో గరిష్ఠం - అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్పం : ఎక్సైజ్‌ శాఖ నోటిఫై చేసిన 3,396 దుకాణాల్లో 2,261 (66.57 శాతం) మండలాల్లోనే ఏర్పాటుకానున్నాయి. నగరపాలక సంస్థల్లో 511, పురపాలక సంఘాల్లో 499, నగర పంచాయతీల్లో 125 చొప్పున ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖపట్నం కార్పొరేషన్‌ పరిధిలో అత్యధికంగా 136, గుంటూరులో 52 చొప్పున ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తిరుపతిలో 227, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 40 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి: నూతన మద్యం విధానంలో భాగంగా దుకాణాల్లో నేషనల్, మల్టీ నేషనల్‌ బ్రాండ్లను అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం. ఇందులో వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ విక్రయిస్తారు. ఈ నేపథ్యంలోనే సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు కోసం చెల్లించే బేసిక్‌ ప్రైస్‌ (మూల ధర)ను చెల్లించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ 90 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువును నిర్ణయించారు.

ప్రస్తుతం లిక్కర్​పై 10 రకాల పన్నులు వేస్తుండగా, తాజా ఎక్సైజ్ విధానంలో వాటిని ఆరుకు తగ్గించారు. వ్యాట్, రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ డ్యూటీ, స్పెషల్‌ మార్జిన్, అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం, రౌండింగ్‌ ఆఫ్‌ పన్నులు మాత్రమే వేయనున్నారు.

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​ - అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు! - Application For AP New Liquor Shops

నూతన మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్‌ - ANDHRA PARADESH LIQUOR POLICY 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.